Begin typing your search above and press return to search.

హోరున గాలి.. వడగళ్ల వాన.. క్యూలో ఒక్కరు కదల్లేదే?

By:  Tupaki Desk   |   6 May 2020 9:45 AM IST
హోరున గాలి.. వడగళ్ల వాన.. క్యూలో ఒక్కరు కదల్లేదే?
X
కమిట్ మెంట్ కు కొత్త అర్థాన్ని చెప్పే ఘటనగా దీన్ని చెప్పాలి. ఓవైపు హోరు గాలి వీస్తున్న వేళ.. మరోవైపు జోరుగా కురుస్తున్న వడగళ్ల వానతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. రక్షణగా పెట్టుకున్న గొడుగులు కదిలిపోతున్న వేళ.. పరుగులు తీసుకుంటూ కాస్త సేఫ్ గా ఉన్న ప్లేస్ లో సెట్ అయ్యే సీన్ రెగ్యులర్. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఇప్పుడు చెప్పనున్నాం.

వడగళ్ల వాన వణుకు పుట్టిస్తున్నా.. రోడ్డు పక్కన క్యూలో నిలుచునే ఉన్నారే తప్పించి కదిలే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ ఇంతటి కమిట్ మెంట్ దేని కోసం? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. వాట్సాప్ లో విపరీతంగా వైరల్ గా మారి షేర్ అవుతోంది.

నైనిటాల్ లోని ఒక వైన్ షాపు బయట మందుబాబులు నిలుచున్నారు. వారికి కేటాయించిన సర్కిల్స్ లోనే ఉంటూ.. జోరు వానకు తడవకుండా ఉండేందుకు గొడగుల్ని రక్షగా పెట్టుకున్నారు. అయినప్పటికి జోరుగా కురుస్తున్న వానలో తడుస్తున్నా సరే.. పక్కకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి వడగళ్ల వాన షురూ అయిన వెంటనే.. మద్యం కోసం క్యూలో నిలుచున్న వారు వెళ్లిపోతారని సదరు షాపు యజమాని భావించినా.. కస్టమర్లు మాత్రం మందు పట్ల తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తూ ఉండిపోయారు.

తమ వరకు అవకాశం వచ్చే వరకూ వెయిట్ చేస్తూ.. తమ వంతు వచ్చాక మద్యం కొనుగోలు చేశాకే ఇంటి ముఖం పట్టటం గమనార్హం. ఏమైనా వడగళ్ల వానలోనూ మద్యం విషయంలో మందుబాబులు ప్రదర్శించిన స్ఫూర్తి అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు.