Begin typing your search above and press return to search.

ఢిల్లీ హత్యాకాండలో యూపీ నాటు తుపాకులు

By:  Tupaki Desk   |   27 Feb 2020 1:01 PM IST
ఢిల్లీ హత్యాకాండలో యూపీ నాటు తుపాకులు
X
దేశ రాజధానిలో జరుగుతున్న అల్లర్లలో కొత్త కోణం వెలుగుచూసింది. ఇప్పటికే ఈ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 30 దాటింది. ఇరువర్గాల దాడుల్లో ప్రధానంగా వాడింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంట్రిమేడ్ నాటు తుపాకులు అని తేలింది. యూపీ తుపాకులు, కత్తులు వాడే ఈ హత్యాకాండ కొనసాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. యూపీ నుంచే ఈ ఆయుధాలు తరలివచ్చాయని తెలియడం సంచలనంగా మారింది.

ఈనెల 24,25వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో దుండగులు యూపీ కంట్రీమేడ్ నాటు తుపాకులు, కత్తులు, సుత్తెలు, కొడవళ్లు, బేస్ బాల్ బ్యాట్లు, పెద్ద కర్రలు, పెద్ద రాళ్లు వినియోగించారని పోలీసులు తేల్చారు. ఇవన్నీ యూపీ నుంచే సరఫరా అయ్యాయని కనిపెట్టారు. ట్రక్కుల్లో తీసుకొచ్చారని.. చిల్లర దొంగలు, నిరుద్యోగులను ఏరగా వాడారని.. ఢిల్లీలోని పలు ఇళ్ల డాబాల్లో ఖాళీ సీసాలు, పెట్రోల్, రాడులు దాచారని పోలీసులు గుర్తించారు.

పలువురు శరీరాల్లో ఇప్పటికీ తుటాలు, పదునైన బ్లేడ్లు, రాళ్లు, డ్రిల్ బిట్లు ఉన్నాయని వైద్యులు సంచలన నిజాలు తెలిపారు. ఇవన్నీ యూపీకి చెందినవని పోలీసులు తేల్చారు. చనిపోయిన 27మందిలో 14మంది యూపీ తుపాకులు కాల్చడం ద్వారానే మరణించినట్టు గుర్తించారు.

యూపీ అక్రమ తుపాకుల రవాణాకు, తయారీకి అడ్డా. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు తుపాకులు రహస్యంగా రవాణా అవుతుంటాయి.యూపీలో తుపాకీ ఒక్కొక్కటిని రూ.3వేల నుంచి రూ.5వేలకు అమ్ముతారు. ఆటోమేటిక్ తుపాకులను రూ.20వేలకు లభిస్తాయని పోలీసులు తెలిపారు. వీటి ద్వారానే ఢిల్లీలో మారణహోమాన్ని సృష్టించారని తేలింది.