Begin typing your search above and press return to search.
ఆ కుర్రాడికి కొత్త టెన్షన్ గా ఇద్దరు పిల్లల ఆంటీ..
By: Tupaki Desk | 7 Feb 2020 9:45 AM ISTఇవాల్టి రోజున వెలుగు చూస్తున్న ఉదంతాలు చూస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఊహించటానికి వీల్లేని రీతిలో లింకులు బయటకు వస్తున్నాయి. ఆడ.. మగ అన్న తేడా లేకుండా సెక్స్ లైఫ్ కోసం పడుతున్న పాట్లు.. చేస్తున్న ప్రయత్నాలు కొత్త కలకలానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం ఈ కోవకు చెందినదే. ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం వింటే అవాక్కు అవ్వాల్సిందే.
సదరు వెనుకబడిన రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారింటి ఎదురుగా 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఆ కుర్రాడి మీద ఆంటీ కన్ను పడింది. అబ్బాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. అతడితో చిలిపిగా మాట్లాడటం.. సెక్స్ గురించి మాటలు చెప్పుకొచ్చేది.
ఎవరికి చెబితే ఏం జరుగుతుందో అన్న భయంతో ఆ కుర్రాడు మౌనంగా ఉండి పోయేవాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల సదరు మహిళ.. తన భర్తను.. ఇద్దరు పిల్లల్ని వదిలేసి వస్తానని.. తనను ఎక్కడికైనా తీసుకెళ్లిపొమ్మని అడగటమే కాదు.. పారిపోదామంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో.. ఆ కుర్రాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి.
దీంతో చదువు మీద ఫోకస్ చేయలేక.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కిందామీదా పడిపోతున్నాడు. కొడుకు తీరులో తేడాను గుర్తించిన తండ్రి.. అబ్బాయిని దగ్గరకు పిలిచి.. అనునయంగా మాట్లాడుతూ నెమ్మదిగా విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశాడు. దీంతో.. ఆ కుర్రాడు బరస్ట్ కావటమే కాదు.. తాను ఇప్పటి వరకూ ఎలాంటి తప్పు చేయలేదని.. తనకు ఆంటీ టార్చర్ ఎక్కువైందంటూ భోరుమన్నాడు. వెంటనే రియాక్ట్ అయిన అతగాడి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. తమ మైనర్ కొడుకును వేధిస్తున్న ఆంటీ మీద చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరిపి.. ఆమెను ప్రశ్నించారు. తనకు తన భర్త మీద ఇష్టం లేదని.. అందుకే పిల్లల్ని వదిలేసి వస్తానని చెప్పానంటూ నిజాన్ని ఒప్పుకున్నట్లు తెలిసిందే. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ షురూ చేశారు పోలీసులు.