Begin typing your search above and press return to search.

ఓడితే… ఉత్తమ్ చాప్టర్ క్లోజ్ - గెలిస్తే..?

By:  Tupaki Desk   |   18 April 2019 8:00 PM IST
ఓడితే… ఉత్తమ్ చాప్టర్ క్లోజ్ - గెలిస్తే..?
X
నల్లగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడి పరిస్థితి ఆసక్తిదాయకంగా మారింది. ఎమ్మెల్యే హోదాలో ఉండిన ఈయనను పట్టుబడి రాహుల్ గాంధీ నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేయించారని అంటారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అతి తక్కువమంది ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు.

అలాంటి వ్యక్తిని వెంటనే ఎంపీగా పోటీ చేయించడం ఒకింత సాహసమే. ఇక్కడ కాంగ్రెస్ కే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెండు తలనొప్పులున్నాయి!

ఆయన నల్లగొండ నుంచి ఎంపీగా నెగ్గలేదేంటే.. అంతటితో ఆయన రాజకీయానికి చాలా దెబ్బ పడుతుంది. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో కీలక పదవులకు ఎదిగిన ఉత్తమ్ రెడ్డి నల్లగొండ నుంచి ఇప్పుడు గెలవకపోతే ఆయనకు ఇకపై కీలక పదవులు దక్కే అవకాశాలు తక్కువై పోతాయి. రాజకీయ భవితవ్యం దెబ్బ తింటుంది.

నల్లగొండ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ అనుకూలత ఉన్న సీటే. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ అనుకూలత కనిపించలేదు. మరి ఇప్పుడు గనుక అక్కడ నుంచి ఉత్తమ్ గెలిస్తే అది ఒకింత సంచలనం కూడా అవుతుంది. ఉత్తమ్ కు హై కమాండ్ దగ్గర బలం కూడా చాలా పెరుగుతుంది.

గెలిస్తే అలా తిరుగు ఉండదు కానీ.. ఓడితే పరువు పోతుంది. రాజకీయ భవితవ్యం దెబ్బ తిటుంది. ఇక మరో విషయం.. గెలిచినా, వెంటనే మరో ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీగా నెగ్గితే ఆ పదవినే చేపడతారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సీటు కు ఉప ఎన్నిక తప్పదు. అక్కడ పోటీ చేసి మళ్లీ దాన్ని నిలబెట్టుకోవడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో పరీక్షే అవుతుంది!