Begin typing your search above and press return to search.

బ‌లం లేకున్నా బ‌రిలోకి ఎందుకో ఉత్త‌మ్ చెప్పేశారు

By:  Tupaki Desk   |   23 March 2018 10:31 AM GMT
బ‌లం లేకున్నా బ‌రిలోకి ఎందుకో ఉత్త‌మ్ చెప్పేశారు
X
సోయి లేదు.. సిగ్గు లేదు.. బ‌లం లేకున్నా ఎక్క‌డైనా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ఆగ్ర‌హ వ్యాఖ్య‌కు.. ఒక పూట ఆల‌స్యంగా తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ ఘాటు రిప్లై ఇచ్చారు. నీతులు చెప్పే కేసీఆర్ చేసే ప‌నులు ఎలా ఉంటాయో ఆధారాల‌తో స‌హా చూపించారు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నికైన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేశార‌ని.. వారు పార్టీ మారిన‌ప్ప‌టికీ.. విప్ ధిక్క‌రించి టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు ఓటు వేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. టీఆర్ ఎస్ లోకి జంప్ అయిన త‌మ పార్టీ ఎమ్మెల్యేల ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని ఉత్త‌మ్ రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హంతో మండిప‌డ్డారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కేసీఆర్ నీచ‌మైన రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ కు సిగ్గు లేదు.. సోయి లేదని.. 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురు ఎంపీ అభ్య‌ర్థుల్ని ఎలా పోటీకి పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ ధిక్క‌రించార‌ని.. ఫిరాయింపుల‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌ని మండిపడ్డారు.

కేసీఆర్ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్ట‌టానికి.. త‌మ పార్టీ ఎమ్మెల్యేల్ని ఆక‌ర్షించిన వైనాన్ని జాతీయ స్థాయిలో ఎండ‌గ‌ట్టేందుకు.. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ త‌న‌కు బ‌లం లేకున్నా అభ్య‌ర్థిని బ‌రిలోకి నిలిపిన‌ట్లుగా చెబుతున్నారు. చేతిలో అధికారం లేకున్నా.. ఎవ‌రికి ఉండే వ్యూహాలు వారికి ఉంటాయి క‌దా?