Begin typing your search above and press return to search.

ల‌క్ష మందితో..తెలంగాణ ప్ర‌జా గ‌ర్జ‌న స‌భ‌

By:  Tupaki Desk   |   18 May 2017 10:23 AM GMT
ల‌క్ష మందితో..తెలంగాణ ప్ర‌జా గ‌ర్జ‌న స‌భ‌
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున ఆక్రోషం ఉంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక సంద‌ర్భాల్లో ఈ ఆగ్ర‌హం బ‌య‌ట‌ప‌డింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌ల్లో ఉన్న ఆవేద‌న‌ను తెలియ‌జెప్పేందుకు తెలంగాణ ప్ర‌జా గ‌ర్జ‌న స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గాంధీభవన్ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 2004 నుండి 2014 కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ప్రజలు మార్పు కోరుకొని మ‌రో పార్టీకి చాన్స్ ఇచ్చారే త‌ప్ప వారిపై ప్రేమ ఉండి కాద‌ని అన్నారు. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్రం తామే సాధించామ‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం వ‌ల్ల ఇక్క‌డ‌ కొత్త ప్రభుత్వం గ‌ద్దెనెక్కింద‌ని తెలిపారు.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత గ‌ద్దెనెక్కిన స‌ర్కారులు ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించాయ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో కేసీఆర్, ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పే మాట‌ల‌కు, చేసే పనులకు పొంతన లేదని మండిప‌డ్డారు. వీరి వ‌ల్ల‌ కేంద్ర రాష్ట్ర లో ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు పై సమస్యలపై ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చామని వివ‌రించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ళ పరిపాలనాలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిప‌డ్డారు. అందుకే తీవ్ర నిరాశ‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా జూన్ 1న సంగారెడ్డి లో `తెలంగాణ ప్రజా గర్జన బహిరంగ సభ`` నిర్వ‌హిస్తున్నామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వస్తార‌ని తెలిపారు. రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌తో పాటుగా కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల్లో నెలకొన్న అసమ్మతి పై ఈ బహిరంగ సభ ఉంటుందని వివ‌రించారు. సుమారు లక్షమంది పాల్గొనే ప్రాంగ‌ణంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించనున్న‌ట్లు వెళ్ల‌డించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారని, త‌మ స‌భ విజ‌య‌వంతం అవ‌డంపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

టీఆర్ ఎస్‌ ముడేళ్ల పరిపాలనలో రాజకీయ లబ్ది తప్ప మరేమీ లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్‌ ఎస్ వైఫల్యం అసమర్థత - నిర్లక్ష్యం కార‌ణంగా భారతదేశంలో రైతు ఆత్మహత్యలపై రెండో స్థానములో ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులు - యువత అయితే వారి పట్ల కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్క‌ మహిళ కూడా మంత్రిగా లేకపోవడం చూస్తుంటే మ‌హిళలంటే ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ కు చిత్త‌శుద్ధి లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. రైతులకు 123 జీవో ఉపయాగం లేదని, దీనిపై కోర్టు కి వెళతామ‌ని తెలిపారు. సిగ్గు ఎగ్గూ లేకుండా వలసలు ప్రోత్సాహకాలు చేపట్టడం రాజకీయ దిగజారుడుతనమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన కూడా అని ఉత్త‌మ్ మండిప‌డ్డారు.కాగా, త‌మ పార్టీ నేత‌లు ఎవరు మ‌రో పార్టీలో చేరడం లేదని ఉత్త‌మ్ తెలిపారు. బీజేపీ సీనియర్లే కాంగ్రెస్‌ పార్టీలో చేరతామంటూ తమను సంప్రదిస్తున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/