Begin typing your search above and press return to search.
రేవంత్ కు షాకిచ్చేలా ఉత్తమ్ కొత్త మాట.. ఆయనకే కుర్చీనా?
By: Tupaki Desk | 10 Dec 2020 10:12 AM ISTప్రస్తుతానికైతే పవర్ లేని పదవిగా చెబుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుకొకరు చొప్పున పోటాపోటీగా తాము పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఇలాంటివేళ.. పీసీసీ తదుపరి చీఫ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ పదవి కోసం రేవంత్.. కోమటిరెడ్డి.. జగ్గారెడ్డి.. వీహెచ్.. శ్రీధర్ బాబు.. ఇలా చాలామందే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ప్రస్తుతానికైతే రేవంత్.. కోమటిరెడ్డి.. శ్రీధర్ బాబుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై నేతలు తమ అభిప్రాయాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. కాకుంటే.. ఉత్తమ్ వారసుడి ఎంపిక ప్రక్రియ షురూ అయ్యిందని.. కొత్త అధ్యక్షుడి పేరును ఖరారు చేసే వరకు ఉత్తమ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం పోటీ రేవంత్.. కోమటిరెడ్డి మధ్యనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన సమావేశంలో ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన ఒక మాట.. ఆసక్తికరంగా మారటమే కాదు.. తన వారసుడి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారా? అన్న భావన కలిగింది.
సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్.. కోమటి రెడ్డికి బెస్టాఫ్ లక్ అన్న మాట చెప్పటంతో.. రేవంత్ కు బదులుగా కోమటిరెడ్డికి టీపీసీసీ చీఫ్ బాధ్యతను అప్పజెప్పాలని డిసైడ్ అయ్యారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పదవిని రేవంత్ కు ఇస్తే పార్టీకి పునర్ వైభవం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు రేవంత్ కు పదవిని అప్పజెబితే.. కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలుతుందని.. దీంతో మరింత నష్టంవాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష స్థానాన్ని అప్పజెప్పాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.