Begin typing your search above and press return to search.

టాయిలెట్ లో ఫోన్ చూస్తున్నారా? డేంజర్

By:  Tupaki Desk   |   22 Sep 2019 1:30 AM GMT
టాయిలెట్ లో ఫోన్ చూస్తున్నారా? డేంజర్
X
సెల్ ఫోన్ పిచ్చి ఇప్పుడు మనుషులను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా నేటి యువతలో పిల్లల్లో ఈ జాఢ్యం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ చేతిలో లేకుంటే పిచ్చివాళ్లు అయిపోతున్నారు. గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్లోనే గడిపేస్తున్నారు. టాయిలెట్లో కూడా వదలకుండా ఫోన్లో ఆడుకుంటూనే ఆ పని పూర్తిచేస్తున్నారు.

టాయిలెట్లో ఫోన్ వాడితే దానికి మించిన డేంజర్ ఏదీ లేదని తాజాగా బ్రిటన్ కు చెందిన ఓ సర్వే తేల్చింది. ఆ దేశంలోని యువత దాదాపు 57శాతం మొబైల్ ఫోన్ తో టైంపాస్ చేస్తూనే టాయిలెట్ పోతున్నారని సర్వే తేల్చింది. ఫోన్ చూస్తూనే విసర్జన చేయడం చాలాచాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

టాయిలెట్ లో ఫోన్ చూడడం వల్ల పైల్స్ వ్యాధి వస్తుందని.. అవసరం కంటే ఎక్కువ సేపు ఇలా ఉండడం వల్ల పెద్ద పేగు చివరి భాగంలో పాయువులోని సిరల పై ఒత్తిడి పెరిగి పైల్స్ బయటకు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

టాయిలెట్ లో ఫోన్ చూడడం వల్ల పైల్స్ తోపాటు మలబద్దకం తీవ్రమవుతుందని.. ఆ భాగంలో పుండులా మారి రక్తస్రావం జరిగి విస్తర్జనకు వెళ్లాలంటే నరకం చూస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిరుదలపై దురద, విసర్జన ఎర్రగా మారడం.. ఇంకా వస్తున్నట్టు అనిపించడం, చీము రావడం దీని లక్షణాలు అని తెలిపారు. సో టాయిలెట్ వెళ్లినప్పుడు సెల్ ఫోన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.