Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ తహతహ..వారికి సొమ్ముల్ని తెచ్చి పెడుతోందట!

By:  Tupaki Desk   |   12 April 2020 4:00 AM IST
లాక్ డౌన్ వేళ తహతహ..వారికి సొమ్ముల్ని తెచ్చి పెడుతోందట!
X
ఇంట్లో నుంచి బయటకు రాకూడదన్న ఆంక్షలు. వస్తే.. లేనిపోని తిప్పలు. ఇలాంటివేళ.. కొత్త పరిచయాల కోసం పడుతున్న తపన అంతా ఇంతా కాదు. తమకు సరిపడా జోడి కోసం వెతుకుతున్న వారికి తాజా విరామం ఓ చక్కటి అవకాశంగా మారింది. కలలో కూడా ఊహించని లాక్ డౌన్ వేళ.. డేటింగ్ యాప్ లకు వినియోగదారులు భారీగా పెరుగుతున్నారట. లాక్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి రోజుకు పద్దెనిమిదివేల మంది చొప్పున కొత్త వినియోగదారులు చేరుతున్నట్లుగా ప్రముఖ డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ వెల్లడించింది.

ప్రస్తుతం తమ యాప్ లో 80 లక్షలకు పైనే యాక్టివ్ యూజర్స్ ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా పెరిగిన ట్రాఫిక్ లో మార్కెటింగ్ కు చెందిన వ్యక్తులు యాభై శాతం ఉంటే.. వ్యాపారులు.. విద్యార్థులు తర్వాతి స్థానంలో ఉన్నట్లు పెరిగింది. కొత్తగా వచ్చిన వారి పుణ్యమా అని చాట్ లు కూడా భారీగా పెరిగినట్లు వెల్లడించింది.

రోజు వారీగా చేసుకునే చాట్ లు 3.5లక్షల నుంచి 5 లక్షలకు చేరుకున్నాయని చెప్పింది. కత్త వినియోగదారులు రోజుకు 80 శాతం చొప్పున పెరుగుతూ వచ్చినట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. తాజా పరిణామాలతో తమ ఆదాయం పెరిగిందని చెప్పింది క్వాక్ క్వాక్. కరోనా మాయదారి వైరస్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడి.. తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వేళ.. డేటింగ్ యాప్ ల పంట పండటం గమనార్హం. అనుకుంటాం కానీ ఒకడి నష్టం మరొకరికి లాభంగా మారుతుందనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చేమో?