Begin typing your search above and press return to search.

ఉత్త‌ర కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:08 PM GMT
ఉత్త‌ర కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్‌
X
అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత విదేశాల‌తో సంబంధాల విష‌యంలోచాల సున్నితంగా, ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర కొరియాను మ‌రోసారి అమెరికా తీవ్రంగా హెచ్చ‌రించింది. ఉత్త‌ర కొరియా ఎలాంటి అణ్వాయుధాల‌ను వాడినా.. ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని అమెరికా రక్ష‌ణ మంత్రి జేమ్స్ మాటిస్ స్ప‌ష్టంచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. ఆ దేశానికి అమెరికా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు. ఈ ఏడాది చివరిక‌ల్లా ద‌క్షిణ కొరియాలో అమెరికా క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మోహరించ‌నున్నట్లు మ‌రోసారి మాటిస్ తేల్చిచెప్పారు. ఉత్త‌ర కొరియా ప‌దేప‌దే మిస్సైల్‌, న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం.. రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంపై అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూనే ఉంది. తాజాగా ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ దేశానికి అమెరికా సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపిన మాటిస్‌.. ఉత్త‌ర కొరియాకు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం విశేషం.

ఇదిలాఉండ‌గా...ఇప్ప‌టికే ద‌క్షిణ కొరియాలో అమెరికాకు చెందిన 28500 మంది సైనికులు ఉన్నారు. వీరి కోసం సౌత్ కొరియా ప్ర‌భుత్వం ఏటా 90 కోట్ల డాల‌ర్లు వెచ్చిస్తోంది. ద‌క్షిణ కొరియా, అమెరికా సైనికులు క‌లిసే ఇక్క‌డ‌ శిక్ష‌ణ పొందుతారు. సియోల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రితో స‌మావేశ‌మైన త‌ర్వాత జేమ్స్ మాటిస్ మీడియాతో మాట్లారు. "అమెరికాపై లేదా మిత్ర‌దేశాల‌పై ఎలాంటి దాడికి దిగినా.. వారిని ఓడించి తీరుతాం. ఒక‌వేళ అణ్వాయుధాల‌ను వాడితే.. ప‌రిణామాలు మ‌రింత తీవ్రంగా ఉంటాయి" అని ఉత్త‌ర‌ కొరియాను హెచ్చ‌రించారు. గ‌తేడాది ఐదోసారి న్యూక్లియ‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించిన దక్షిణ‌ కొరియా.. త‌మ ద‌గ్గ‌ర అమెరిక‌పై దాడి చేసే క్షిప‌ణి కూడా ఉంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అమెరికా ప్ర‌ధాన భూభాగంపై కూడా దాడి చేయ‌గ‌లిగే ఖండాంత‌ర బాలిస్టిక్ మిస్సైల్ తాము సిద్ధం చేసుకున్నామ‌ని, త్వ‌ర‌లోనే దీనిని ప‌రీక్షిస్తామ‌ని ఈ మ‌ధ్యే మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/