Begin typing your search above and press return to search.
గ్రీన్ కార్డులపై అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 4 Dec 2020 1:03 PM ISTఅమెరికా వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డ్ ఓ కల. శాశ్వతంగా అక్కడ సెటిల్ కావడానికి వీలు కల్పించే చట్టపరమైన వెసులుబాటు. కానీ, అమెరికాలో గ్రీన్ కార్డు పొందడం రోజురోజుకు కష్టతరమవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన అడ్డగోలు నిబంధనలు, ట్రంప్ రాక ముందు నుంచి ఉన్న పాత విధానాలు...వెరసి భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చేవాళ్లు గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో చేరితే వారికి గ్రీన్ కార్డ్ రావడానికి చాలా సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చాలా సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారని, కొన్ని సార్లు వారు తమ వలస హోదాను కూడా కోల్పోతున్నారని కొందరు అమెరికా సెనేటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రీన్ కార్డు సమస్యకు చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొనాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరు విషయంతో అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రతి ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేసింది. ఈ ప్రకారం ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది. అయితే, ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించింది. కానీ, ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అమెరికా అధ్యక్షుడు సంతకం చేస్తే ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ అవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 2020 నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే ఉన్నారు. చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసిన బిల్లుకు తాజాగా సెనేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో, చైనాకు ప్రతికూలంగా అమెరికా ఉన్న నేపథ్యంలో ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.