Begin typing your search above and press return to search.

28 ఏళ్ల తర్వాత.. ఆ జాబితాలో ట్రంప్ పేరు ఎక్కనుందా?

By:  Tupaki Desk   |   6 Nov 2020 4:00 PM IST
28 ఏళ్ల తర్వాత.. ఆ జాబితాలో ట్రంప్ పేరు ఎక్కనుందా?
X
మన దేశ ఎన్నికల వ్యవస్థకు.. అమెరికాకు ఏ మాత్రం పోలిక ఉండదు. ఆ మాటకు వస్తే.. సంవత్సరం మొత్తం తరచూ ఏవో ఒక ఎన్నికలు జరుగుతుంటాయని అక్కడి వారు చెబుతుంటారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్ని యావత్ ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తుంటుంది. అమెరికాలో జరిగే అధికార బదిలీ ప్రపంచాన్ని అంతో ఇంతో ప్రభావితం చేస్తుందన్నది సత్యం.

మనదేశంలో మాదిరి.. ఎంత కాలమైనా కీలక పదవుల్లో ఉండే అవకాశం అమెరికాలో ఉండదు. ఎంతటి బలమైన అధినేత అయినా.. ప్రజాభిమానం మరెంత ఉన్నా కూడా.. దేశాధ్యక్షుడిగా కేవలం రెండు టర్మ్ లు మాత్రమే పని చేసే వీలుంది. అంతకు ముందు.. నాలుగుసార్లు ఎన్నికయ్యే అవకాశం ఉండేది. దీంతో.. ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో.. అమెరికా రాజ్యాంగానికి జరిపిన 22వ సవరణతో.. నాలుగు సార్ల నుంచి రెండుసార్లకు కుదిస్తూ సవరణ చేశారు.

ఈ నేపథ్యంలో ఎంత పెద్ద నాయకుడైనా సరే.. దేశాధ్యక్ష పదవిలో రెండు ధఫాలు మాత్రమే పోటీ చేసే వీలుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా.. దేశాధ్యక్ష పదవిలో ఉన్న వారు తరచూ రెండు టర్మ్ లు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ నకు ముందుగా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామా కావొచ్చు.. ఆయనకు ముందున్న జార్జిబుష్ జూనియర్ కావొచ్చు.. ఆయనకు మరింతముందున్న క్లింటన్ కావొచ్చు.. ఆయనకు ముందున్న సీనియర్ జార్జి బుష్ కావొచ్చు.. వీరంతా రెండు దఫాలుగా అధ్యక్షులుగా వ్యవహరించిన వారే.

దాదాపు 28 ఏళ్ల క్రితం బెంజమిన్ హారిసన్ మాత్రమే ఒకసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికై.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితిని ట్రంప్ ఎదుర్కోనున్నట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఓట్ల లెక్కింపు సమాచారం ప్రకారం.. ట్రంప్ ఓటమికి అడుగు దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అదేసమయంలో ఆయన ప్రత్యర్థి జో బైడెన్ సైతం గెలుపునకు అడుగు దూరంలోనే ఉన్నారు.