Begin typing your search above and press return to search.

బుధవారం 8AM.: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇలా

By:  Tupaki Desk   |   4 Nov 2020 12:40 PM IST
బుధవారం 8AM.: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇలా
X
ఓవైపు జోరుగా పోలింగ్.. మరోవైపు ఎన్నికల ఫలితాల వెల్లడి.. ఇలాంటి సిత్రమైన సీన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాగుతుంది. భారతకాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటికి.. అమెరికాలోని తూర్పు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. తొలుత పోలింగ్ పూర్తి అయిన చిన్న రాష్ట్రాల ఫలితాలు ఇప్పటివకే వెలువడ్డాయి.

రాష్ట్రాల్లో గెలుపు విషాయానికి వస్తే.. తొలుత డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ వెనుకబడినట్లుగా కనిపించింది. తర్వాత పుంజుకున్న ఆయన ట్రంప్ మీద స్వల్ప అధిక్యతను ప్రదర్శిస్తున్నారు. గడిచిన వందేళ్ల అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వెలువడిన ఫలితాల్ని చూస్తే.. ట్రంప్.. బైడెన్ లు పలు రాష్ట్రాల్లో విజయం సాధించారు. ట్రంప్.. బైడెన్ గెలిచిన రాష్ట్రాలు సమానంగా ఉంటే..

ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం ట్రంప్ కంటే బైడెన్ అధిక్యతతో ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్ 85 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ 72 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించారు. పాపులర్ ఓట్లలో మాత్రం ట్రంప్ అధిక్యత కనిపిస్తోంది. మొత్తం 588 ఎలక్టోరల్ ఓట్లలో ఎవరైతే 270 ఓట్లు సాధిస్తారో వారు విజయం సాధించినట్లుగా తేలుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో పాపులర్ ఓట్లలో మాత్రం ట్రంప్ అధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.

ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు
- వెస్ట్ వర్జీనియా
- కెంటకీ
- సౌత్ కరోలైనా
- ఒక్లహామా
- అర్కన్సాస్
- టెన్నసీ
- ఇండియానా
- మిస్సిసిపీ
- అలబామా
బైడెన్ గెలిచిన రాష్ట్రాలు
- వర్జీనియా
- వెర్మాంట్
- ఇల్లినాయిస్
- మేరీలాండ్
- డెలావెర్
-న్యూజెర్సీ
- కనెక్టీకట్
- మాసాచుసెట్స్
- రోడ్ ఐలాండ్
ట్రంప్ అధిక్యంలో ఉన్న రాష్ట్రాలు
- ప్లోరిడా.. జార్జియా.. నార్త్ డకోటా.. మిషిగాన్.. మెనీ
బైడెన్ అధిక్యంలో ఉన్న రాష్ట్రాలు
- టెక్సాస్.. కాన్సాస్.. మిస్సౌరీ.. ఒహైయో.. పెన్సిల్వేనియా.. న్యూ హాంప్ షైర్.. నార్త్ కరోలైనా