Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్ ను బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు జోబిడెన్

By:  Tupaki Desk   |   25 Jan 2022 12:30 PM GMT
జర్నలిస్ట్ ను బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు జోబిడెన్
X
అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఒక జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ద్రవ్యోల్బణం గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్ పై విరుచుకుపడ్డారు. వైట్ హౌస్ లో ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం మీడియా జర్నలిస్టులు బయటకు వస్తుండగా.. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ప్రశ్నించడంతో అధ్యక్షుడు జోబిడెన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.బూతులు తిట్టాడు.

‘ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత కాదా?’ అని అమెరికా అధ్యక్షుడిని ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి జోబిడెన్ ‘యూ స్టిపిడ్’ అంటూ ఆ తర్వాత ఒక బూతు పదం వాడారు. బైడెన్ మైక్ ఆన్ లో ఉండగానే ఇది జరిగింది. పక్కనే ఉన్న మీడియా జర్నలిస్టులు బిడెన్ ప్రవర్తనతో నిర్ఘాంత పోయారు.

అయితే బైడెన్ ఏం అన్నారో అర్థం కాలేదని ఆ జర్నలిస్ట్ పీటర్ డూకీ అన్నారు. అనంతరం డూకీని పిలిచి వ్యక్తిగతంగా తీసుకోవద్దని జోబైడెన్ సూచించారు.

కాగా ఫ్యాక్స్ న్యూస్ కన్జర్వేటివ్స్ కు అనుకూలంగా ఉండే మీడియా కావడంతోనే జోబైడెన్ ఇలా సీరియస్ అయినట్లు సమాచారం.