Begin typing your search above and press return to search.

ట్రంప్ భార‌తీయుల మ‌న‌సును గెలుచుకున్నాడుగా

By:  Tupaki Desk   |   18 Oct 2017 7:04 AM GMT
ట్రంప్ భార‌తీయుల మ‌న‌సును గెలుచుకున్నాడుగా
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌తీయుల మ‌న‌సు గెలుచుకున్నారు. తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతికి చెందిన విజిటర్స్‌ తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ - సీమా వర్మ - ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గత ఏడాది దీపావళి సమయంలో.. వర్జీనియా - ఫ్లోరిడాల్లో ఉన్న హిందూ ఆలయాలను ఇవాంకా విజిట్ చేశారు. ఆ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీలో ఉన్న ట్రంప్... న్యూజెర్సీలో దీపాలను కూడా వెలిగించారు. వైట్‌ హౌజ్‌ లో దీపావళి వేడుకలను జరుపుకునే సాంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు. వైట్‌ హౌజ్ కాంప్లెక్స్‌ కు ఆనుకుని ఉన్న ఇండియన్ ట్రీట్ రూమ్‌ లో ఆ వేడుకలను నిర్వహించేవారు. కానీ బుష్ ఎప్పుడూ నేరుగా వైట్‌ హౌజ్‌ లో దివాళీ సంబరాల్లో పాల్గొనలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వైట్‌ హౌజ్‌ లోని ఈస్ట్ రూక్ రూమ్‌ లో దీపావళి వేడుకల్లో పాల్గోనేవారు.

దీపావళి వేడుకల్లో పాల్గోన్న డోనాల్డ్ ట్రంప్ తన ఫేజ్‌ బుక్ పేజీలో ప్రత్యేకంగా ఓ పోస్ట్ చేశారు. భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గోనడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందూ మత విశ్వాసాలను నమ్మే భారతీయ ప్రజలను ప్రత్యేకంగా చూస్తామని ట్రంప్ అన్నారు. భారత్..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిందన్నారు. ప్రధాని మోదీతో తనకు బలమైన బంధం ఉందని ట్రంప్ అన్నారు. హిందూ మతంలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉందని - ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది భారతీయులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని ట్రంప్ అన్నారు. అమెరికాలోనే సుమారు 20 లక్షల మంది భారతీయులు దీపావళి జరుపుకుంటున్నారన్నారు. బౌద్ధులు - సిక్కులు - జైనులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తు చేశారు.

అమెరికా ప్రగతికి.. ప్రపంచానికి.. భారతసంతతీయులు విశేష తోడ్పాటు అందించారన్నారు. ఆర్ట్ - సైన్స్ - మెడిసిన్ - బిజినెస్ - ఎడ్యుకేషన్ రంగాల్లో.. భారతీయులు అందించిన సేవలు.. అనితరసాధ్యమని ట్రంప్ అన్నారు. ఇండియన్ అమెరికన్ పౌరులకు అమెరికా చాలా రుణపడి ఉందని, వారందరికీ థ్యాంక్స్ అని ట్రంప్ తెలిపారు. దీవాళిని ప్రజలు తమ ఇళ్ల‌ల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఈ సారి ఆ వేడుకను గర్వంగా పీపుల్స్ హౌజ్(వైట్‌ హౌజ్)లో సెలబ్రేట్ చేసుకుంటున్నామని ట్రంప్ అన్నారు. అమెరికా కుటుంబంలో.. ఇండియన్ అమెరికన్లు.. హిందూ అమెరికన్లు భాగస్వామ్యులే అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రజలకు ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.