Begin typing your search above and press return to search.

వైరల్..కరోనా బయటకొచ్చింది చైనా ల్యాబ్ నుంచేనట!

By:  Tupaki Desk   |   17 April 2020 2:50 PM GMT
వైరల్..కరోనా బయటకొచ్చింది చైనా ల్యాబ్ నుంచేనట!
X
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్థానం చైనాలోని వూహాన్ నుంచే మొదలైందన్న వాదనలో ఎలాంటి అనుమానాలు లేకున్నా... వూహాన్ లో ఏ విధంగా కరోనా బయటకు వచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వైరస్ ను బయటకు వదిలిందని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కరోనా వైరస్ ను ఏకంగా చైనా వైరస్ అని పలకడమే కాకుండా కరోనా పాపమంతా చైనాదేనన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ వాదన కరెక్టేనన్న రీతిలో ‘ఫాక్స్ న్యూస్’ ఓ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం మేరకు... కరోనా వైరస్ వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి బయటకు వచ్చిందని, అది కూడా అక్కడ జరిగిన ఓ పొరపాటు కారణంగానే కరోనా వైరస్ ప్రస్థానం మొదలైందని తెలుస్తోంది.

ఫాక్స్ న్యూస్ కథనం మేరకు వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ వైరాలజీలో కరోనా లాంటి చాలా వైరస్ లపై ప్రయోగాలు, అధ్యయనాలు చేస్తుంటారట. ఈ క్రమంలో గబ్బిలాల్లోని కరోనా వైరస్ పైనా అక్కడ అధ్యయనం జరిగిందట. ఈ క్రమంలో సదరు అధ్యయనంలో పాలుపంచుకున్న ఓ విద్యార్థిని చేసిన చిన్న పొరపాటుతో కరోనా వైరస్ తొలుత ఆమెకు సోకిందట. ఆ తర్వాత ఆమె ద్వారా ఆమె ప్రియుడికి కరోనా సోకిందట. కరోనా వైరస్ సోకిన తర్వాత సదరు విద్యార్థిని ప్రియుడు... వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ వైరాలజీ సమీపంలోని మాంసం మార్కెట్ కు వెళ్లగా... అక్కడ అతడి నుంచి ఇతరులకు కరోనా సోకిందట. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించిందని, ల్యాబ్ లో జరిగిన చిన్న పొరపాటుతో ఇఫ్పుడు యావత్తు ప్రపంచం నానా పాట్లు పడుతోందని సదరు కథనం పేర్కొంది.

ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దగా వివరాలేమీ ఇవ్వకున్నా...ఈ విషయంపై తాము కూడా వివరాలు సేకరిస్తున్నామన్న కోణంలో చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చైనా వర్సిటీలో జరిగినఈ పొరపాటు కారణంగానే కరోనా కలకలం రేగిందన్న వాదనలను గట్టిగా వినిపిస్తున్న ట్రంప్... ఫాక్స్ న్యూస్ కథనంతో ఈ పాపమంతా చైనాదేనని గట్టిగా నమ్మే స్థితికి వచ్చారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. అయితే వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ వైరాలజీ నుంచే కరోనా బయటకు వచ్చినా... అదేమీ ఉద్దేశ్యపూర్వకంగా కాదని - ల్యాబ్ లో సదరు విద్యార్థిని చేసిన చిన్న పొరపాటే ఈ ఉత్పాతానికి కారణమని ఫాక్స్ న్యూస్ చెబుతున్నా... ఇంతటి ప్రమాదకరమైన వైరస్ లపై అధ్యయనాలను ఏమాత్రం జాగ్రత్తలు లేకుండా ఎలా చేస్తారన్నది అమెరికా వాదనగా వినిపిస్తోంది. మొత్తంగా ఫాక్స్ న్యూస్ కథనం ఇప్పుడు పెను కలకలమే రేపేలా ఉందని చెప్పక తప్పదు.