Begin typing your search above and press return to search.

ట్రంప్ టూర్: అమెరికా-భారత్ ఒప్పందాలు ఇవే..

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:30 AM GMT
ట్రంప్ టూర్: అమెరికా-భారత్ ఒప్పందాలు ఇవే..
X
భారత పర్యటనలో తొలిరోజు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు విహరించారు. అహ్మదాబాద్ లో బహిరంగ సభ, తాజ్ మహాల్ సందర్శనతో తదితర వాటితో ముగియగా రెండో రోజు వీరి పర్యటనలు పూర్తిగా అధికారిక కార్యకలాపాలతోనే గడిచింది. ముఖ్యంగా విధానపరమైన కార్యకలాపాల్లో డొనల్డ్ ట్రంప్ బిజీబిజీగా గడిపారు. భారతదేశం ముఖ్యమైన స్నేహ దేశంగా అభివర్ణించిన ట్రంప్ ఈ సందర్భంగా భారతదేశంతో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణాంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భం గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య పలు అంశాలపై చర్చలు చేశారు. ఈ సమావేశం లో వీసాల గురించి ట్రంప్ వద్ద మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వాణిజ్య, రక్షణ రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకుసాగుతాయని ఈ సందర్భం గా నరేంద్ర మోదీ, డొనల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిన్న, ఇవాళ తమ పర్యటన అద్భుతం గా సాగిందని ట్రంప్ తెలిపారు. చర్చల సందర్భంగా ట్రంప్‌కు మోదీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రపంచ నేతకు భారత్‌లో ఈ స్థాయిలో ఘనస్వాగతం ఇంతకు ముందు ఎప్పుడూ పలక లేదని ఈ సందర్భం గా మోదీ పేర్కొన్నారు. ట్రంప్ కూడా భారత్ ఆతిథ్యానికి మరోసారి ధన్యవాదాలు చెప్పారు.

5జీ నెట్ వర్క్ పై చర్చ సాగింది. ఈ సందర్భంగా 300 కోట్ల రక్షణ ఒప్పందాలు కుదిరాయి. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నియంత్రణ తదితర వాటిపై ఒప్పందాలు కుదిరాయని సమాచారం. 21 శతాబ్దానికి అమెరికా-భారత్ స్నేహం ముఖ్యమైందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.

అంతకుముందు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ లో ట్రంప్‌ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్ ఆయన సతీమణి ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. వారి వెంట ప్రధానమంత్రి మోదీ కూడా ఉన్నరు. కోవింద్ సతీమణి ట్రంప్ దంపతులకు రెండు చేతులు జోడించి నమస్కారం అంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ట్రంప్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. మోదీ తో చర్చలకు ట్రంప్ వెళ్లగా ఆయన సతీమణి మెలానియా ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భం గా హ్యాపీనెస్ క్లాసులను పరిశీలించారు. గంట పాటు మెలానియా ఆ పాఠశాలలో సందడి చేశారు. మెలనియాకు పాఠశాల విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికి హారతిచ్చి బొట్టు పెట్టి సంప్రదాయ స్వాగతం లభించింది.