Begin typing your search above and press return to search.

పౌరసత్వ చట్టం పై ప్రశంసలు కురిపించిన అగ్రరాజ్యం !

By:  Tupaki Desk   |   19 Dec 2019 12:48 PM IST
పౌరసత్వ చట్టం పై ప్రశంసలు కురిపించిన అగ్రరాజ్యం !
X
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ .. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి అనేక సంచలన నిర్ణయాల తో పాలన కొనసాగిస్తుంది. ఈ తరుణంలోనే తాజాగా ..పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని పై దేశంలో కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా కేంద్రం ఈ చట్టం పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తుంది. ఇకపోతే ఈ నేపథ్యంలో ఈ పౌరసత్వ చట్టం పట్ల అమెరికా ప్రశంసలు కురిపించింది. పౌరసత్వం, మత స్వేఛ్చ వంటి అంశాలపై ఆ దేశంలో విస్తృత చర్చ జరిగిందని, భారత ప్రజాస్వామ్యాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపింది.

ప్రపంచంలో మైనారిటీలు, మతపరమైన హక్కుల పరిరక్షణ పట్ల తాము సదా యోచిస్తుంటామని, ముఖ్యంగా పౌరసత్వం పై కీలకమైన చర్చను మీరు లేవనెత్తారని అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో అన్నారు. వాషింగ్టన్ లో ఆయన తమ దేశ రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 2 +2 పేరిట జరిగిన ఈ సమావేశంలో భారత విదేశాంగ, రక్షణ మంత్రులు ఎస్.జయశంకర్, రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.

సవరించిన పౌరసత్వ చట్టంపై ఇండియాలో వెల్లువెత్తిన నిరసనల గురించి జయశంకర్ ని మీడియా అడగ్గా .. మీరు ఈ అంశం పై జరిగిన డిబేట్ ను కూలంకషంగా పరిశీలించిన పక్షంలో కొన్ని దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్న మైనారిటీల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినదే ఈ చట్ట సవరణ అని అర్థమౌతుంది అని ఆయన చెప్పారు. ఆయా దేశాల్లో మైనారిటీ లు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి బహుశా అవగాహన చేసుకుంటే ఇలా మాట్లాడరు అని ఆయన చెప్పారు. ఈ విధమైన అంశాలపై కేవలం ఇండియానే గాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని పాంపియో తెలిపారు.