Begin typing your search above and press return to search.
అమెరికన్ల ను దోచేస్తున్న భారత కాల్ సెంటర్ల పై కేసు
By: Tupaki Desk | 30 Jan 2020 1:24 PM ISTఐటీ లో భారతీయులు మరీ ముదిరి పోయారు. ఒకప్పుడు ఐటీ అంటే అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కొట్టిన పిండి. కానీ ఇప్పుడది భారతీయుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు భారతీయులంటే అతిశయోక్తి కాదు.. అంతటి తెలివిగల భారతీయులు ఇప్పుడు అమెరికావాసులనే బురిడి కొట్టిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. వివిధ ఆకర్షనీయ పథకాలంటూ అమెరికన్లనే దోచుకుంటున్న భారతీయ కాల్ సెంటర్ల తీరు పై తాజాగా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు కూడా నమోదు చేయడం సంచలనంగా మారింది..
*మోసపూరిత కాల్స్ తో అమెరికన్ల కు వల
తాజాగా విదేశాల నుంచి అమెరికా వినియోగదారులకు కోట్ల సంఖ్యలో మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తున్నాయట.. అందులో భారత్ కాల్ సెంటర్ల నుంచే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని అమెరికా గుర్తించింది. దీనివల్ల అమాయక అమెరికా ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారని.. తీవ్రంగా వారికి ఆర్థిక నష్టం వాటిల్లుతోందని అమెరికాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి..
* భారత కాల్ సెంటర్లపై కేసులు
అమెరికన్లను ఫేక్ కాల్స్ తో మోసం చేస్తున్న భారతీయ కాల్ సెంటర్లపై అమెరికా సీరియస్ అయ్యింది. మోసపూరిత కాల్స్ చేస్తూ అమెరికన్లనే బురిడీ కొట్టిస్తున్న ఐదు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై తాజాగా అమెరికా కేసులు నమోదు చేసింది. దేశంలోకి కాల్ సెంటర్లు, రోబో కాల్స్ నియంత్రణకు ఆదేశాలు జారీ చేయాలని అమెరికా న్యాయశాఖ తన పిటీషన్ లో పేర్కొనడం గమనార్హం.
*కేసులు బుక్కైంది వీరిపైనే..
తాజాగా మోసపూరిత కాల్స్ చేస్తున్న ఇకామర్స్ నేషనల్ ఎల్ఎల్ సీ డీ/బీ/ఏ టోల్ ఫ్రీడల్స్ డాట్ కామ్, ఎస్ఐపీ రిటైల్ డీ/బీ/ఏ సిప్ రిటైల్ డాట్ కామ్, , వాటి ప్రమోటర్లు నికోలస్ పలంబో, నటాషా పలంబోపై అమెరికన్ పోలీసులు కేసులు పెట్టారు. ఇక గ్లోబల్ వాయిస్ కామ్, గ్లోబల్ టెలీకమ్యూనికేషన్ సర్వీసెస్, కేఏటీ టెలికాం, వాటి ప్రమోటర్లు అయిన జాన్ కహేన్ (గ్రేట్ నెక్, న్యూయార్క్) పై మరో కేసు నమోదు చేశారు. వెంటనే వీరి నుంచి వాయిస్ కాల్స్ నిలిపి వేయాలంటూ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం విశేషం.
ఇలా ప్రపంచ పెద్దన్నలు, టెక్నాలజీ ఆద్యులు అమెరికన్లనే మాయమాటలతో మోసం చేస్తున్న భారతీయ కాల్ సెంటర్ల నిర్వాహకుల పై అమెరికా కేసులు పెట్టడం చర్చనీయాంశం గా మారింది.