Begin typing your search above and press return to search.
అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ.. ఫ్లోరిడా వాసుల చూపు ఎవరివైపు ?
By: Tupaki Desk | 7 Sept 2020 1:20 PM ISTప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. కరోనా టీకా ఎప్పుడు వస్తుంది, కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుంది అని ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా ఎన్నికల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్న దానిపై అభ్యర్థుల గెలుపు ఆధారపడి ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది.
గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ, ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేయబోతున్నారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. కానీ , ఈసారి జనం నాడి పసిగట్టడం చాలా కష్టం అవుతుంది. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్ కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ కి స్పష్టమైన ఆధిక్యత వచ్చేలా ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. ఒక్క 1992 లో అది రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ తరువాత వారు ఎవరికీ ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఈ డిబేట్స్‌లో ట్రంప్ గెలుస్తారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది ఉన్నారు. అమెరికాలో కరోనా కట్టడి లో ట్రంప్ చేతులెత్తేయడంతో ట్రంప్ పై వ్యతిరేకత వచ్చి ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. చూడాలి మరి .. స్వింగ్ రాష్ట్రాల చూపు ఎవరిపై ఉంటుందో ..