Begin typing your search above and press return to search.
ప్రచారంలో ట్రంప్ దూకుడు!
By: Tupaki Desk | 13 Oct 2020 4:20 PM ISTకరోనా నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గరపడడంతో ఆయన ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే కరోనా కారణంగా పదిరోజుల పాటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ట్రంప్ తాజాగా తన క్యాంపెయిన్ ను ముమ్మరం చేశారు.
పూర్తిగా కోలుకున్న ట్రంప్ తాజాగా ఫ్లోరిడాలో ఉత్తేజంగా మాట్లాడారు. తాను కరోనా వైరస్ కు గురై ఇప్పుడు పూర్తిగా రోగ నిరోధకత సాధించానని వైద్యులు చెబుతున్నారని ప్రజలకు ట్రంప్ వివరించారు.
ఇక ట్రంప్ ఫ్లోరిడా పర్యటనకు ముందు నిర్వహించిన కరోనా టెస్ట్ లో ట్రంప్ కు నెగెటివ్ వచ్చిందని అతడికి వైద్యం చేస్తున్న వైద్య బృందం వెల్లడించింది. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాలను చుట్టిరావాలని ట్రంప్ ప్రణాళికలు రూపొందించుకున్నారు.
కరోనాను జయించాక జరిగిన ఫ్లోరిడా క్యాంపెయిన్ లో ట్రంప్ ఏకంగా గంట సేపు మాట్లాడారు. హిల్లరీ క్లింటన్పై విమర్శల నుంచి మీడియా అవినీతి ప్రస్తావన.. లెఫ్ట్ కు హెచ్చరికలు, సోషలిస్ట్ లపై విరుచుకుపడుతూ ట్రంప్ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఎన్నికల్లో తామే గెలుస్తామని.. వైట్ హౌస్ లో మరో నాలుగేళ్లు కొనుసాగుతామని స్పష్టం చేశారు. ఇక ఆయన ప్రత్యర్థి జో బిడెన్ మాత్రం కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రచార ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.