Begin typing your search above and press return to search.
ఏలియన్స్ మనమధ్యే ఉన్నాయి..! నేను నిరూపిస్తా.. ఇజ్రాయేల్ మాజీ జనరల్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 Dec 2020 4:00 PM ISTఏలియన్స్‌ను (గ్రహాంతరవాసులు) సినిమాలు, సీరియల్స్‌లో తప్ప నిజజీవితంలో ఎవరూ చూసిఉండరు. వీరి గురించి అనేక కథలు, నవలలు వచ్చాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాల్లోనూ వీరి పేరుతో సినిమాలు తీశారు. అయితే ఏలియన్స్‌ను తాను చూశానని.. గ్రహాంతరవాసులు మనుషులతో కలిసి తిరుగుతున్నాయని ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఇజ్రాయేల్‌కు మాజీ జనరల్‌గా పనిచేసిన ఓ అధికారి. దీంతో ఈ విషయంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది.
ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను దాచి పెట్టిందని.. వాళ్ల నుంచి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నదని కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి ఆరోపణలు కాదు పచ్చి నిజాలు అంటున్నాడు ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ అధికారి హైమ్ ఎషెడ్. ఆయన ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏలియన్స్ ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఏలియన్స్ తమ ఉనికిని కావాలనే రహస్యంగా ఉంచుతున్నాయి. ఏలియన్స్ ఒత్తిడి వల్లే వాటి ఉనికిని ప్రభుత్వాలు బయటకు చెప్పడం లేదు. భూమి మీద ఉన్న ప్రజలకు ఏలియన్స్ అంటే ఓ తప్పుడు భావన ఉంది. చాలా సినిమాల్లో అలాగే చూపించారు. అందుకే ఏలియన్స్ ఇప్పుడు తమ ఉనికిని బయకటపెట్టేందుకు ఇష్టపడటం లేదు’ అని ఎషెడ్ అన్నారు..
ఎషెడ్ 1981-2010 వరకు ఇజ్రాయేల్ స్పేప్ సెక్యూరిటీ ప్రొగ్రామ్‌లో పని చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏలియన్స్ ఉనికిని ప్రపంచానికి చెప్పాలని భావించాడని కానీ గెలాక్సీ ఫెడరేషన్‌లోని ఏలియన్స్ ఆయనను ఆపాయన్నారు. అయితే గ్రహాంతరవాసుల ఉనికిని తాను నిరూపించగలనని ఎషెడ్ అంటున్నారు. గ్రహాంతరవాసులు గెలాక్సీ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించుకున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వంతో కలిసి అవి పనిచేస్తున్నాయని కూడా ఆయన అన్నారు. అయితే ఈ విషయంలో ఉన్న నిజానిజాలేమిటో ఆయా దేశాల అంతరీక్షపరిశోధకులు స్పందిస్తే కానీ తెలియదు.