Begin typing your search above and press return to search.
అమెరికాకు నో ఎంట్రీ: భారత్ పై ట్రావెల్ బ్యాన్
By: Tupaki Desk | 1 May 2021 9:11 AM ISTభారత్ లో కరోనా కల్లోలం దృష్ట్యా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది. మే 4 నుంచి అమెరికాకు వెళ్లేందుకు భారతీయులకు అనుమతిని నిరాకరించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు మే 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమెరికాలోకి భారతీయుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా మేరకు భారత్ నుంచి ప్రయాణాలను అమెరికాకు నిషేధిస్తున్నట్టు ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. ఇక అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్ లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు.
ప్రస్తుతం భారత్ లో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. కరోనా కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లలో వైరస్ విస్తరిస్తోందని సీడీసీ నిర్ధారించింది. బీ.1.617 అనే కొత్త వైరస్ వేరియంట్ భారత్ లో కేసుల పెరుగుదలకు కారణమని అమెరికన్ సీడీసీ అభిప్రాయపడింది.
ఈ మేరకు పరిస్తితిని సమీక్షించిన అమెరికా ప్రభుత్వం భారత్ పై ప్రయాణ నిషేధాన్ని విధిస్తూ చర్యలు అవసరమని తేల్చింది. అమెరికా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
అలాగే అమెరికా పౌరులు, గ్రీన్ కార్డు దారులు, వారి భార్యలు, 21 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపును ఇచ్చారు.