Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వర్క్‌ ఫోర్స్‌ గ్రాంట్ కోసం 1,100 కోట్లు ప్రకటించిన అమెరికా !

By:  Tupaki Desk   |   25 Sept 2020 4:00 PM IST
హెచ్‌1బీ వర్క్‌ ఫోర్స్‌ గ్రాంట్ కోసం  1,100 కోట్లు ప్రకటించిన అమెరికా !
X
అతి త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే జో బైడెన్ కూడా ఈసారి ఎలాగైనా వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. దీనితో కరోనా విజృంబిస్తున్నా కూడా తమ సభలు, ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్య రంగాల్లో మిడిల్‌ టూ హై స్కిల్డ్‌ హెచ్‌1బీ వృత్తుల శిక్షణనకు గాను 150 మిలియన్‌ డాలర్ల ( అంటే మన కరెన్సీ లో సుమారు 1,100కోట్ల రూపాయలు) ప్యాకేజీని ప్రకటించింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌ పోర్టేషన్ రంగాల్లో ప్రస్తుత శ్రామిక శక్తితో పాటు, భవిష్యత్ శ్రామిక శక్తిని పెంచడానికి గాను కొత్త తరం కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఈ హెచ్ ‌1బీ వర్క్‌ ఫోర్స్‌ గ్రాంట్‌ ఉపయోగపడుతుందని కార్మిక శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కార్మిక మార్కెట్లలో అంతరాయాలను కలిగించడమే కాక, అనేక విద్య, శిక్షణా సంస్థలు, యజమానులు శిక్షణను ఎలా అందించాలో పునరాలోచించవలసిన పరిస్థితులను తీసుకువచ్చింది అని కార్మిక శాఖ విభాగం ప్రకటనలో తెలిపింది.

ఈ భారీ ప్యాకేజీ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయ్ ‌మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో మరింత సమగ్రమైన శ్రామికశక్తి వ్యవస్థను ప్రోత్సహించడానికి, నిధులు, వనరులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. ఇది దరఖాస్తుదారులకు వినూత్నమైన ట్రైన్రింగ్‌ ప్రొగ్రాంని అందించడమేకాక, ఆన్‌ లైన్ ‌తో సహా విభిన్న రీతుల్లో ట్రైనింగ్‌ ఇస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్థానిక పబ్లిక్‌, ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ముందుకు తీసుకుపోతుంది. వీరు ఆయా వర్గాలలోని వ్యక్తులకు కీలకమైన పరిశ్రమ రంగాల్లో మిడిల్‌ టూ హై స్కిల్డ్‌ హెచ్‌ 1బీ వృత్తులలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి శిక్షణనిస్తారు. ఈ పబ్లిక్‌- ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ కార్యక్రమం ద్వారా ఫెడరల్‌, స్టేట్‌, లోకల్‌ ఫండింగ్‌ స్ట్రీమ్స్‌ మాత్రమే కాక ప్రైవేట్‌ సెక్టార్‌ లో ట్రైనింగ్‌ కార్యక్రమం, ఉపాధి సేవలు, సహాయక సేవలకు సంబంధించి ఉపాధి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.