Begin typing your search above and press return to search.
ఊర్మిళ అభ్యర్థిత్వం పై అసంతృప్తి లో శివసైనికులు ... అది కలగానే మిగిలిపోనుందా !
By: Tupaki Desk | 2 Nov 2020 3:20 PM ISTమహారాష్ట్ర ప్రభుత్వం 12 మందికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించ నుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీనితో ఒక్కొక్క పార్టీ నుంచి నలుగురికి చోటు దక్కనుంది. అయితే అందులో రంగీలా ఫేమ్ ఊర్మిళ మంటోడ్కర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి, ముఖ్యనేత సంజయ్ రౌత్ ఇప్పటికే తెలిపారు. అయితే ,తాజా పరిస్థితులని బట్టి చూస్తే ఊర్మిళ అసలు నెరవేరేలా కనిపించడం లేదు.
నటి ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబై నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఓడిపోవడంతో.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. వారు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయానని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు శివసేన అధిష్టానం ఆమెను ఏకంగా విధాన పరిషత్ కు పంపాలని ప్రయత్నాలు చేస్తుంది. అధికార శివసేన నుంచి శాసనమండలికి నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాష్ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు పార్టీల నేతలు ఓ అంచనాకు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఆమెకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఊర్మిళ అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయం అంటూ వార్తలు రావడం తో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు.గత అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నేరుగా మండలికి పంపడంపై సరైంది కాదని చర్చించుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే మేం ఇలాగే పార్టీలో ఉండిపోవాలా.. అని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,శివసేన ఇచ్చిన ఆఫర్ ను ఊర్మిళా మాతోండ్కర్ ఆమోదించినట్లు తెలిసింది. అయితే కార్యకర్తల అభిప్రాయాలను శివసేన పరిగణలోకి తీసుకుంటుందా లేదో .