Begin typing your search above and press return to search.

ఊర్మిళకు మోదీ మార్క్‌ షాక్‌

By:  Tupaki Desk   |   15 April 2019 6:04 PM IST
ఊర్మిళకు మోదీ మార్క్‌ షాక్‌
X
దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ హవా చాలా తక్కువుగా ఉంటుంది కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం చాలాఎక్కువగా ఉంటుంది. ఇక మరాఠా లాంటి ప్రాంతాల్లో అయితే.. మోదీకున్న ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫాలోయింగ్‌ తోనే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊర్మిళ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్‌ గా కాంగ్రెస్‌ పార్టీలోచేరి ముంబై నార్త్‌ నుంచి సీటు సంపాదించేసింది ఊర్మిళ. సీటు సంపాదించడమే కాదు.. ప్రచారం కూడా ఉదృతంగా చేస్తోంది. ఇక క్యాంపెయిన్‌ చివరి దశలో ఉంది అనగా.. బీజేపీ కార్యకర్తలు ఊర్మిళకు షాక్‌ ఇచ్చారు. ఊర్మిళ క్యాంపెయిన్‌ లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు.. జై మోదీ జై మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఊర్మిళకు షాకైంది. వెంటనే తేరుకుని వారిని సముదాయించాలని చూసినా వర్కవుట్ కాలేదు. వెంటనే.. అక్కడున్న కాంగ్రెస్‌ కార్యకర్తలకు - బీజేపీ కార్యకర్తలకు గొడవ అయ్యింది. పోలీసులు ఇద్దర్ని చెల్లెచెదురు చేయడంతో సమస్య సద్దుమణిగింది. అయితే.. ఊర్మిళ మాత్రం తన ప్రచారాన్ని మధ్యలో ఆపేసి అక్కడని నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మోదీ షాక్‌ ఊర్మిళకు గట్టిగానే తగిలింది.