Begin typing your search above and press return to search.

నటీమణి ప్రచారానికి స్టార్ హీరోలు సహకరం లేనట్టేనా!

By:  Tupaki Desk   |   30 March 2019 7:00 AM IST
నటీమణి ప్రచారానికి స్టార్ హీరోలు సహకరం లేనట్టేనా!
X
బాలీవుడ్ లో కేవలం గ్లామరస్ తారగానే కాదు.. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది ఊర్మిల. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన ఊర్మిల ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది. స్టార్ అయ్యింది. నటిగా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది ఊర్మిల. ఆమిర్ ఖాన్ - షారూక్ - సల్మాన్ - అనిల్ కపూర్ - సంజయ్ దత్ వంటి వాళ్లందరి సరసనా వివిధ సినిమాల్లో నటించింది ఊర్మిల.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది. అలా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఊర్మిల ఇప్పుడు రాజకీయం పై ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈమెకు ముంబై నార్త్ ఎంపీ టికెట్ ఖరారు అయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన కూడా చేసేసింది. ఇక ఊర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడమే తరువాయి.

ఇలాంటి నేపథ్యంలో ఊర్మిల ఈ ఎన్నికల్లో బాలీవుడ్ నుంచి తనకు అందే సహకారం గురించి మాట్లాడింది. బాలీవుడ్ లోని తన సహచర నటీనటులు తన కోసం ప్రచారానికి వస్తారని ఊర్మిల విశ్వాసంగా చెప్పలేకపోయింది. వస్తే రావొచ్చు.. రాకపోతే రాకపోవచ్చు అన్నట్టుగా మాట్లాడింది. వాళ్లు వచ్చినా - రాకపోయినా ఒకటే అన్నట్టుగా మాట్లాడింది ఈ నటీమణి. ఇప్పుడే తను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా.. రాజకీయ పోరాటం పట్ల తనకు ఆసక్తి ఉన్నట్టుగా ఊర్మిల చెప్పింది. తన తరఫున సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేసేస్తారని మాత్రం ప్రచారం చేసుకోవడం లేదు ఈ నటీమణి.

మరి ఈ నటీమణి కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరైనా వచ్చి ప్రచారంచేసి పెడతారేమో చూడాల్సి ఉంది. పదిహేనేళ్ల కిందట ఇదే నియోజకవర్గం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఘన విజయం సాధించారు. అదే బాలీవుడ్ లక్ ఊర్మిలకు కూడా కలిసి వస్తుందేమో చూడాలి!