Begin typing your search above and press return to search.

ఊర్మిలపై బీజేపీ ఎంపీ సెక్సీ కామెంట్స్!

By:  Tupaki Desk   |   2 April 2019 11:23 AM GMT
ఊర్మిలపై బీజేపీ ఎంపీ సెక్సీ కామెంట్స్!
X
ముంబై నార్త్ లో బరిలోకి దిగిన సినీ నటి ఊర్మిలపై బీజేపీ ఎంపీ గోపాల్ షెట్టి సెక్సీ కామెంట్స్ చేశారు. రంగీలా ఊర్మిలకు ప్రత్యర్థి గా బరిలోకి దిగిన ఈ ముంబై నార్త్ సిట్టింగ్ ఎంపీ గోపాల్ షెట్టి వివాదాన్ని రేపారు. సినీతారల విషయంలో ఇలాంటి మాటలు మామూలే కానీ, ఈయన ఎటొచ్చీ ఒక మహిళ విషయంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడంలో ఒకింత వివాదాస్పదం అవుతున్నాయి.

ముంబై నార్త్ లో తనదే విజయం అని గోపాల్ షెట్టి అంటున్నారు. అందుకు తను చేసిన పనులే కారణమని, ప్రజలు ఎంపీగా తన పని తనాన్ని చూస్తారని.. కాబట్టి విజయం తనదే అని అన్నాడు. అంతటిలో ఆగకుండా.. ‘ఊర్మిల సభలకు జనాలు వస్తారు..ఆమె గ్లామరస్ హీరోయిన్ - ఆమె మొహాన్ని చూడటానికి జనాలు పోటీలు పడతారు..’అని ఈ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.

సినీ గ్లామర్ ఉంది కాబట్టి ఆమె కోసం జనాలు వస్తారని అనుంటే పోయేది. అయితే ఆమె ఫిజిక్ మీద - ఆమె అందం మీద ఈయన కామెంట్లు చేసేశారు. ఆమె అందాన్ని చూడటానికి జనాలు వస్తారన్నట్టుగా మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

రాజకీయాల్లోకి వచ్చిన హీరోయిన్లపై ఇలాంటి వ్యాఖ్యలు కొత్తవేమీ కావు. గతంలో కూడా చాలా మంది ఎదుర్కొన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్నా.. స్మృతీ ఇరానీ మీద అలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిల విషయంలో రావడంలో వింత ఏముంది!