Begin typing your search above and press return to search.

ఊర్మిళకు వర్మ తెలుసా - తెలియదా.?

By:  Tupaki Desk   |   21 April 2019 5:58 AM GMT
ఊర్మిళకు వర్మ తెలుసా - తెలియదా.?
X
ఊర్మిళ. ఒకప్పటి బాలీవుడ్‌ సన్షేషనల్‌ హీరోయిన్‌. రంగీళా - సత్య సినిమాలతో సూపర్‌ పాపులర్‌ అయ్యింది. ఈ రెండు సినిమాలు లేకపోతే.. ఊర్మిళ అంటే ఎవ్వరికీ తెలియదు. అంతెందుకు రంగీళా సినిమా కంటే ముందు ఊర్మిళ చాలా సినిమాలు చేసింది కానీ అవీవే ఎవ్వరికీ తెలియదు. కేవలం తెలిసిందల్లా రంగీళా ఒక్కటే. దానికి కారణం.. వన్‌ అండ్‌ ఓన్లీ రామ్‌గోపాల్‌ వర్మ. అలాంటి వర్మను గడ్డిపరకలా తీసిపారేసింది ఊర్మిళ.

వివరాల్లోకి వెళ్తే.. ఊర్మిళ ముంబై నార్త్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యలో చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత వర్మ గురించి అడిగారు. దీంతో.. చీ యాక్‌ అనే రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది ఊర్మిళ. ఇంకా చెప్పాలంటే.. అసలు వర్మ పేరు గతంలో ఎక్కడో విన్నాను అన్నట్లుగా బిహేవ్‌ చేసింది. బాలీవుడ్‌లో ఊర్మిళకు కాస్తో కూస్తో పేరు వచ్చిందంటే దానికి కారణం వర్మ అని అందరికి తెలుసు. అలాంటి వర్మను చాలా లైట్‌ తీసుకుంది ఊర్మిళ.

ఊర్మిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెపై సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టాడు. ఊర్మిళ ఫోటోని చూపిస్తూ నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటూ.. మేరా ఊర్మిల మహాన్ అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై ఊర్మిళకు ఒళ్లు మండినట్లుంది. అందుకే వర్మ అంటే తెలీనట్లుగా కలరింగ్‌ ఇచ్చింది. ఇక రంగీళా - సత్య సినిమాల టైమ్‌లో వర్మకు, ఊర్మిళ మధ్య బాండింగ్‌ కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి కానీ వర్మ ఎవ్వరితో బాండింగ్‌ ఉండడనే విషయం అందరికి తెలిసింది. మొత్తానికి తనకి లిఫ్ట్‌ ఇచ్చిన వర్మకు ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది ఊర్మిళ.