Begin typing your search above and press return to search.

కరోనా క్వారంటైన్: మూత్రం బాటిళ్లు విసురుతున్నారా?

By:  Tupaki Desk   |   9 April 2020 2:00 PM IST
కరోనా క్వారంటైన్: మూత్రం బాటిళ్లు విసురుతున్నారా?
X
ప్రశాంతంగా ఉన్న దేశంలో ఢిల్లీలోని తబ్లిగీ మర్కజ్ ప్రార్థనలతో కరోనా ఒక్క సారిగా విస్తరించింది. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందలాది మందికి కరోనా సోకింది. ఇక సమావేశానికి హాజరైన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు.

అయితే ఇప్పటికే తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. వారు వైద్యులు - సిబ్బందిపై ఉమ్మివేస్తున్నారని.. చికిత్సకు సహకరించడం లేదని ప్రచారం సాగింది.

తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని ఒక క్వారంటైన్ కేంద్రం సమీపంలో పెద్ద ఎత్తున మూత్రం బాటిళ్లను పోలీసులు కనుగొన్నారు. ఈ క్వారంటైన్ కేంద్రంలో తబ్లిగి ప్రార్థనలు చేసిన కార్యకర్తలను ఉంచారు. కరోనాపై అనుమానంతో వారిని అబ్జర్వేషన్ లో ఉంచి తిండి - మందులు ఇస్తూ వైద్యులు పరిశీలిస్తున్నారు.

అయితే తాజాగా వీరి కేంద్రం సమీపంలో మూత్రం పోసిన బాటిళ్లు పడి ఉన్నాయి. ఇది తబ్లిగీ కార్యకర్తల పనేనని అనుమానిస్తున్నారు. కరోనాను ఇతరులకు అంటించేందుకు ఇలా చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

విచారణలో తబ్లిగీ కార్యకర్తల పని అని తేలితే వారిపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ క్వారంటైన్ కేంద్రం వద్ద మూత్రం బాటిళ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి ఎవరు వేశారన్నది తేలాల్సి ఉంది.