Begin typing your search above and press return to search.

తప్పు మీదంటే మీదే.. కేంద్రం vs తెలంగాణ

By:  Tupaki Desk   |   9 Sep 2019 5:37 AM GMT
తప్పు మీదంటే మీదే.. కేంద్రం vs తెలంగాణ
X
తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు.. సిద్దిపేట జిల్లాలో ఓ రైతు ఎరువుల కోసం క్యూలో నిలబడి అందక చనిపోయాడు. ఈ పరిణామంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఎరువులను రైతులకు సరఫరా చేయలేక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. ఆందోళనలకు పూనుకుంటున్నాయి.

ఇక టీఆర్ ఎస్ సర్కారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతకు కేంద్రమే కారణమని.. సరైన ఎరువులను రాష్ట్రానికి పంపిణీ చేయలేదని ఆరోపిస్తుంది. బీజేపీపైనే నెపం పెట్టింది.

కాగా తెలంగాణలో ఎరువుల కోసం రైతు ఆత్మహత్యపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక కోరింది. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా తెలంగాణలో ఎరువల కొరతపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు.

దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఎరువుల శాఖ ఇది ముమ్మాటీకి తెలంగాణ వైఫల్యంగానే చెప్పుకొచ్చింది. తాము ఏప్రిల్ - మే - జూన్ నెలల్లోనే ఎరువులను తరలించి నిల్వ చేసుకోవాలని కేటాయిస్తామని చెప్పినా తెలంగాణ ప్రభుత్వం పాత స్టాకు అయిపోయినంత వరకూ కొత్త స్టాకు తీసుకెళ్లలేమని.. గౌడన్లలో ఖాళీలేదని తెలిపిందని కేంద్ర ఎరువుల శాఖ తెలిపింది.. అన్ని రాష్ట్రాలకు ఎరువులు తీసుకెళ్లాలని లేఖ రాసిన తెలంగాణ స్పందించలేదని పేర్కొంది. దీంతో ఈ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కారు ఈ మచ్చను ఎలా తొలగించుకుంటుంది.. ఎరువుల కొరత నిర్లక్ష్యంపై ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.