Begin typing your search above and press return to search.
తారకరత్న హెల్త్ అప్డేట్ : విషమంగా ఆరోగ్య పరిస్థితి
By: Tupaki Desk | 28 Jan 2023 3:12 PM GMTనందమూరి హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు తారకరత్న నారాయణ హృదయాలక ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
'కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్ లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నాం' అని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
కుప్పంలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి హీరో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నట్టు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.. లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయాడు.టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు.
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అని గుర్తించి వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. కార్డియాలజిస్ట్ గుండెపోటు అని తేల్చడంతో కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు.
కుప్పంలో చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం కలుగకపోవడంతో క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు.
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చెందిన గుండె సంబంధిత నిపుణులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కొందరు వైద్యులు మీడియాతో మాట్లాడుతూ తారకరత్న తదుపరి 48 గంటలు క్లిష్టమైనవి.. ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.