Begin typing your search above and press return to search.

బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అప్డేట్..: పోలీసుల అదుపులోకి మరో యువకుడు

By:  Tupaki Desk   |   6 Jun 2022 8:00 AM GMT
బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అప్డేట్..: పోలీసుల అదుపులోకి మరో యువకుడు
X
హైదరాబాద్ లో నడిబొడ్డున బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. కొందరు యువకులు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కారులో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.

అయితే ఈ సంఘటనను ఓ యువకుడు వీడియో తీశారు. ఆ వీడియో బయటకు రావడంతొ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పబ్లిష్ చేసిన సుభాన్ అనే యువకుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే మీడియాలో ప్రసారం చేసిన బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

కళాశాల వేడుకలు నిర్వహించుకుందాని నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలోని ఓ పబ్ కు వచ్చిన కొందరు యువతీయువకులు వచ్చారు. ఇందులో ఓ బాలికను కొందరు యువకులు కలిశారు. వీరిలో నగరంలోని ఓ కార్పొరేటర్ కుమారుడు బాలికతో పరిచయం చేసుకొని అంతకుముందే తన స్నేహితుడంటూ మాటలు కలిపారు. ఈ క్రమంలో మిగతా వారిని కూడా పరిచయం చేసి పబ్ నుంచి బయటకు వచ్చారు.

వీరంతా కలిసి బెంజ్, ఇన్నోవా కార్లలో బయలు దేరారు. వీరిలో ఓ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు బెంజ్ కారు నడుపుతుండగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు మిగతా స్నేహితులు కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా 50 నిమిషాల పాటు కార్లలో తిరుగుతూ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో సుబాన్ అనే యువకుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించాడు. ఆ తరువాత వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియోను పబ్లిక్ గా ప్రసారం చేసినందుకు పాతబస్తీకి చెందిన సుభాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటున్న ఉమేర్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అతడు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్ తో పాటు మరో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సుభాన్ అనే యువకుడితో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఉమేర్ ఖాన్ కోసం గాలిస్తున్నామని అన్నారు.