Begin typing your search above and press return to search.
ఆ భారీ కుంభకోణంలో సన్నీని విచారిస్తారట
By: Tupaki Desk | 7 Feb 2017 12:40 PM GMTక్లిక్కులు కొట్టండి లక్షలు సంపాదించండి అంటూ సోషల్ ట్రేడ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రారంభించి తాజాగా పోలీసులకు చిక్కిన అనుభవ్ మిట్టల్ కేసులో నిజానిజాలు రాబట్టేందుకు పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను విచారించనున్నారు. ఈ స్కామ్ లో బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ను ప్రశ్నించనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పోంజి కుంభకోణం ప్రధాన సూత్రధారి అనుభవ్ మిట్టల్ గతేడాది నవంబర్ 29న ప్రారంభించిన ఇన్ మార్ట్.కామ్ ఈ పోర్టల్ ప్రారంభోత్సవానికి సన్నీ కూడా వచ్చింది. క్రౌన్ ప్లాజా హోటల్ లో ఈ కార్యక్రమం జరగడంతో ఇప్పటికే ఆ హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు. "1978 ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ చట్టం కింద ఇలాంటి స్కీమ్ లను ప్రోత్సహించడం నేరం. ఈ ఈవెంట్ లో ఆ నటి ఉండటాన్ని మేము గుర్తించాం. విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది" అని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రాజ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. సోషల్ ట్రేడ్ వ్యవస్థాపకుడు అనుభవ్ మిట్టల్ తో సన్నీ లియోన్ - ఫిల్మ్ స్టార్ అమీషా పటేల్ లతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే అది ఓ బర్త్ డే పార్టీకి చెందినవని, విచారణకు దానితో సంబంధం లేదని పోలీసులు చెప్పారు.
రూ.3700 కోట్ల మొత్తాన్ని 6.5 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా సేకరించినట్లు అభినవ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో కొన్ని వెబ్ సైట్ల ప్రమోషన్ కోసం సంస్థ పంపే కొన్ని లింకులకు లైకులు కొట్టడమే ఇందులో చేరిన కస్టమర్ల పని. దీని కోసం సబ్ స్క్రిప్షన్ ఫీ అంటూ రూ.5750 నుంచి రూ.57500 వరకు కూడా వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన డబ్బు వందల కోట్లకు చేరడంతో ఈడీ లక్నో జోనల్ కార్యాలయం విచారణ జరిపి సంస్థపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. దేశంలో సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కాం కంటె క్లిక్కుల స్కాం పెద్దది. శారదా స్కాం విలువ రూ.1700 కోట్ల నుంచి రూ.2000 కోట్లు అయితే.. క్లిక్కుల స్కాం విలువ రూ. 3,728 కోట్లు. దాదాపు 7 లక్షల మంది నెట్ యూజర్లు మిట్టల్ ముఠాను నమ్మి మోసపోయారు.
మరోవైపు గతవారం తాను అరెస్ట్ అయిన తరువాత తన వాళ్లకు పంపి వీడియో సందేశాల్లో అనుభవ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఆందోళన చెందవద్దు.. అరెస్ట్ వల్ల మనం మరింత ప్రచారం పొందుతాం.. అరెస్టు అయితే ఒక్కరోజులోనే మన గురించి దేశానికి తెలిసే అవకాశం వచ్చిందని భావించాలి. నేను అరెస్టయ్యాయని బాధపడకండి. ఇదో దుర్దశ అనుకోండి.. బయటకు వస్తాం.. మళ్లీ ఈ ప్రపంచాన్ని ఒక్క ఊపు ఊపేస్తాం# అంటూ తన సంస్థ అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ కీలక సిబ్బందికి, పెట్టుబడిదారులకు మొబైల్ ఫోన్ కెమెరాల ద్వారా రికార్డు చేసిన వీడియో సందేశాలు పంపాడు. ఉత్తరప్రదేశ్‌లో ఒకనాడు ఖాదీకి ప్రఖ్యాతిగాంచిన పిల్ఖువా పట్టణంలో మిట్టల్ పెరిగాడు. ఘజియాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి ఆన్‌లైన్ వ్యాపారాలు పెంచడానికి నకిలీ క్లిక్కుల వ్యాపారం చేసి కేవలం రెండేళ్లలోనే కోటీశ్వరుడయ్యాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/