Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీస్ జిందాబాద్ : స్వీట్లు పంచిన యూపీ పోలీసులు

By:  Tupaki Desk   |   7 Dec 2019 5:27 AM GMT
తెలంగాణ పోలీస్ జిందాబాద్ : స్వీట్లు పంచిన యూపీ పోలీసులు
X
హైదరాబాద్ లో దిశ హంతకుల ఎన్ కౌంటర్ తో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ పోలీసుల చర్యను అందరూ హర్షిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సినీ, రాజకీయ, మేధావులు, ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలే కాదు.. మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసుల్లోనూ తెలంగాణ పోలీసుల చర్య పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ పోలీసులు తాజాగా దిశ ఎన్ కౌంటర్ తర్వాత సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. స్వీట్లు పంచుకుంటూ తెలంగాణ పోలీసులు జిందాబాద్ అంటూ పండుగ చేసుకున్నారు. పోలీస్ అంటే ఎక్కడైనా పోలీస్ అని.. అందుకే ఈ స్వీట్లు పంపిణీ అంటూ సదురు పోలీస్ అధికారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

అయితే నిన్ననే ఇదే యూపీకి చెందిన బీఎస్పీ అధినేత్రి మాయవతి తెలంగాణ పోలీసులను చూసి యూపీ పోలీసులు నేర్చుకోవాలని హితవు పలికారు. యూపీలో నేరాలు, ఘోరాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చోటుచేసుకున్నా యూపీ పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించడం లేదని ఆమె ఆడిపోసుకున్నారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా యూపీ పోలీసులు ఇలా తెలంగాణ పోలీసుల ఎన్ కౌంటర్ పై స్వీట్లు పంచుకోవడం విశేషం.