Begin typing your search above and press return to search.
బురఖా మీద బ్యాన్ సరే.. తప్పుడు పోలికతో చిక్కుల్లో కమలనాథుడు
By: Tupaki Desk | 11 Feb 2020 12:00 PM ISTబురఖా ఉండాలా? వద్దా? అన్నది పెద్ద చర్చ. ఈ విషయాన్ని ప్రస్తావించినంతనే కొందరు కన్నెర్ర చేస్తారు. మతవిశ్వాసాల్లోకి ఎలా వెళతారు? అదెంత పాపం? అని ప్రశ్నిస్తారు. అరే సామి.. ఇదే విషయం హిందువులు అనుసరించే మత విశ్వాసాల విషయంలో ఏమైందిరా?అంటే..నువ్వు మరీ ఇంత సంకుచిత భావాలున్న వ్యక్తివి అనుకోలేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేస్తారు. మతం పక్కన పెట్టి.. మత విశ్వాసాల మీద నీ స్టాండ్ ఏమిటో కాస్త క్లారిటీ ఇవ్వమని అడిగితే.. నీళ్లు నమిలే మేధావులు బోలెడంతమంది మన చుట్టూ కనిపిస్తారు.
ఒక మహిళ తనకు ఇష్టమైతే ముఖాన్ని దాచుకోవటాన్ని తప్పు పట్టలేం. కానీ.. డిజిటల్ యుగంలోనూ మతం పేరుతో ముఖం కనిపించకుండా పరిమితులు విధించటం ఏమిటన్న ప్రశ్న వేసినంతనే సంఘ్ పరివార్ ట్యాగ్ తగిలించేస్తారు. లౌకిక మేధావులతో పాటు.. వామపక్ష వాదులు కూడా ఇదే తీరులో డబుల్ స్టాండ్ ను వినిపిస్తారు. ఇలాంటి వాటిపై గళం విప్పేటోళ్లు కొందరు కనిపిస్తారు. కాకుంటే.. ఇలాంటివారు తమ వాదనను వినిపించే క్రమంలో అత్యాత్సామాన్ని ప్రదర్శించి.. అనవసరమైన విషయాల్ని కెలికి అసలు విషయం పక్కకు పోయి.. పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోతారు.
తాజాగా యూపీకి చెందిన బీజేపీ నేత రఘురాజ్ సింగ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. బురఖాను పలు దేశాలు బ్యాన్ చేశాయన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. ఆ విషయాన్ని అలానే చెప్పేస్తే సరిపోయేది. కానీ.. దానికి తన మేధావి తనాన్ని బయట పెట్టి కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారని చెప్పాలి. బురఖాల్ని శ్రీలంక.. చైనా.. అమెరికా.. కెనడా తదితర దేశాల్లో బ్యాన్ చేశారని.. ఇందుకు భద్రతా పరమైన కారణాలు గా చెప్పటం వరకూ ఆయన బాగానే చెప్పుకొచ్చారు. కానీ.. ఆ తర్వాతే ట్రాక్ తప్పారు. ముక్కు.. చెవులు కోల్పోయిన శూర్పణఖ అరబ్ దేశాలకు పారిపోయిందని.. కోసేసిన అవయువాలు కనిపించకూడదనే ఉద్దేశంతోనే శూర్పణక బురఖా ధరించిందంటూ తన పైత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ నేత కారణంగా ఇష్యూ పక్క దారి పట్టింది.అయినా బురఖాకు శూర్ఫణకు లింకేమిటో ఆ బీజేపీ నేతకే తెలియాలి.
తాజా వ్యాఖ్యలతో వామపక్ష వాదులు మొదలు లౌకిక వాదులంతా చంకలు గుద్దుకునే పరిస్థితి. తమకు ఎంతకూ కొరుకుడుపడని మోడీ సర్కారుతోపాటు.. బీజేపీని ఏసుకునే అవకాశం వచ్చినందుకు వారు మురిసి పోయే పరిస్థితి.ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. మధ్య లో అనవసరమైన పైత్యాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి తిప్పలు ఎదురవుతాయనటానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు. తన మాటలతో తన రాజకీయ ప్రత్యర్థుల చేతికి లడ్డూ ఇచ్చిన కమలనాథుడి తీరుతో బీజేపీ వర్గాలు తల పట్టుకునే పరిస్థితి.