Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఇప్పట్లో ఏపీ - తెలంగాణ మధ్య బస్సులు లేనట్లే !

By:  Tupaki Desk   |   25 Jun 2020 7:00 AM GMT
బ్రేకింగ్ : ఇప్పట్లో ఏపీ - తెలంగాణ మధ్య బస్సులు లేనట్లే !
X
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్‌ లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి వైరస్ పాజిటివ్‌ తేలడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో ఏపీ - తెలంగాణ మధ్య RTC బస్సులు లేనట్లేనా అనే అనుమానం కలుగుతోంది.

2020, జూన్ 17వ తేదీన అంతర్ రాష్ట్ర ఒప్పందంపై APSRTC, TSRTC అధికారులు విజయవాడలో చర్చలు ప్రారంభించారు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు వాయిదా పడడంతో బస్సులు తిరుగుతాయా ? లేదా ? అనే సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో సిటీ బస్సులు తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని..బస్సులు నడపాలని, విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే, ఇప్పటికే జూన్ 01వ తేదీ నుంచి ఏపీలో బస్సులు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. సగటున 3 వేల 266 బస్సులు నడిపింది. 20 రోజుల నుంచి రోజుకు రూ. 2.43 కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. ఈ వైరస్ కంటే ముందు..ఆర్టీసీకి రోజుకి రూ. 12 కోట్ల ఆదాయం వచ్చేది అని అధికారులు తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ..సిటీ బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది.