Begin typing your search above and press return to search.
వావ్.. మోడీలో మాటలే కాదు.. చేతలూ ఉన్నాయ్
By: Tupaki Desk | 1 Aug 2019 3:19 PM ISTఒక మైనర్ బాలికను అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు రావటమే కాదు.. అందుకు తగ్గట్లు ఆధారాలు దొరికితే ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? అలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని వెంటనే పార్టీ నుంచి గెంటేస్తుంది. దగ్గరకు రానివ్వదు. ఆ దరిద్రాన్ని మీదే వేసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడరు. కానీ.. నిత్యం నీతులు చెబుతూ.. మేనేజ్ మెంట్ గురువులా వ్యవహరించే మోడీ మాష్టారు మాత్రం.. వేటు నిర్ణయాన్ని తీసుకోవటానికి పట్టిన కాలం ఏకంగా ఏడాదిన్నర.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఉన్నావ్’ బాధితురాలి హత్యాయత్నం కేసుకు సంబంధించి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న వేళ.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ పై ఆ పార్టీ ఎట్టకేలకు బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలతో పాటు.. తాజాగా జైల్లో ఉన్నతమ బంధువును పరామర్శించేందుకు వెళుతున్న బాధితురాలు.. కుటుంబ సభ్యులతో పాటు వారి కేసును వాదిస్తున్న లాయర్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొన్న వైనం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. బాధితురాలు.. న్యాయవాది ఇద్దరూ తీవ్రగాయాలతో ప్రాణాపాయంతో పోరాడుతున్నారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనతో పాటు.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదంతా బాధితురాలిని హత్య చేసేందుకే అన్న ఆరోపణలకు బలం చేకూరేలా లారీ నెంబరు ప్లేట్ కు నల్ల రంగు పూసి ఉంచటం మరిన్ని అనుమానాలకు కారణంగా మారింది.
ఈ ఉదంతంపై వెల్లువెత్తుతున్న నిరసనలతో మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుతం ఈ ఉదంతాన్ని సీబీఐ విచారించాలని.. వారంలో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వేళ.. ఇన్నాళ్లు మోసుకుంటూ వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు వేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఫర్లేదు.. మాటలు చెప్పే మోడీ తన పార్టీకి చెందిన వారిపై చర్యలు కూడా తీసుకుంటారన్న మాట.