Begin typing your search above and press return to search.

పులివెందుల‌లో వైసీపీ నేతపై హ‌త్యాయ‌త్నం!

By:  Tupaki Desk   |   1 July 2017 3:30 PM IST
పులివెందుల‌లో వైసీపీ నేతపై హ‌త్యాయ‌త్నం!
X
రాయ‌ల‌సీమ‌లో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ ర‌క్క‌సి ప‌డ‌గ విప్పింది. వైసీపీ నేత‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిరాత‌కంగా దాడి చేశారు. స్థానికులంద‌రూ గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో దుండ‌గులు ప‌రార‌య్యారు. పులివెందుల‌లోని రాఘవేంద్ర హాలు సమీపంలో ఈ దారుణ‌ ఘటన జ‌రిగింది.

వైసీపీ నేత చిన్నపురెడ్డి(45) శుక్రవారం రాత్రి 10గం. ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. ఆయన కదలికలపై ముందే నిఘా పెట్టిన ప్రత్యర్థులు రాఘవేంద్ర హాలు సమీపంలోని కూరగయాల మార్కెట్లో మాటు వేశారు. ఒక్క‌సారిగా ఆయ‌న‌పై వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అక్క‌డే ఉన్న కొంతమంది స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు.

ఈ దాడిలో చిన్నపురెడ్డి చేతివేళ్లు రెండు తెగిపోగా, తలకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నపురెడ్డిపై హత్యాయత్నం జరగిందని తెలియగానే.. కడప ఎంపీ వైఎస్ అవినాష రెడ్డి,పార్టీ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరె రెడ్డి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు.

ఆయ‌న డాక్టర్లతో మాట్లాడి చిన్న‌పు రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న‌పు రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుణ్ణి చూసేందుకు పెద్ద సంఖ్య‌లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/