Begin typing your search above and press return to search.
చదువు కోసం రోజూ 10కి.మీలు నడిచిన ప్రణబ్
By: Tupaki Desk | 1 Sept 2020 3:40 PM ISTదేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన చిన్నతనంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ కుటుంబంలో ప్రణబ్ జన్మించారు. ముఖర్జీ తల్లిదండ్రులు కమదా కింకర్ ముఖర్జీ, రాజ్యలక్ష్మి ముఖర్జీ. దాదా తండ్రి కమదా కింకర్ ముఖర్జీ భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పని చేశారు. 1952 నుంచి 1964 మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్సీగా సేవలందించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన చిన్నతనంలో ఎంతో కష్టపడ్డారు. బెంగాల్ లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పుడు స్కూలు వెళ్లడం కోసం రోజూ 10 కి.మీలు నడిచి వెళ్లేవాడు.
అప్పట్లో మాకు రవాణా సౌకర్యాలు ఉండేవి కావని.. చిన్నతనంలో చదువు కోసం రోజూ 10 కి.మీలు నడిచివెళ్లే వాడిని అని ప్రణబ్ ఓ సందర్భంలో తెలిపారు.
ఇక వర్షకాలంలో పరిస్థితి దారుణంగా ఉండేదని ప్రణబ్ గుర్తు చేశారు. బురదలో నడిచే వెళ్లే పరిస్థితి ఉండేది కాదని.. బట్టలన్నీ బురదతో నిండిపోయేవని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి కష్టాలను ప్రణబ్ వివరించారు. అంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని ప్రణబ్ వివరించాడు.