Begin typing your search above and press return to search.
త్యాగానికి చిరునామా..ఆ స్టార్ లేడీ కమెడియన్
By: Tupaki Desk | 5 Sept 2020 3:25 PM ISTకోవై సరళ.. ఒక ప్రత్యేక నటి. సహాయ పాత్రలు మాత్రమే కాదు క్లీన్ కామెడీ పండించడం, సెంటిమెంట్ పాత్రలతో రక్తి కట్టించే టాలెంట్ ఆమె సొంతం. కామెడీ టైమింగ్ పర్ఫెక్టుగా ఉండటం మహిళ నటుల్లో చాలా తక్కువ. కానీ కోవై సరళ.. ఈ పాత్ర ఆ పాత్ర అని కాదు.. ఎందులోనైనా పరకాయప్రవేశం చేసి శభాష్ అనిపించుకోగలదు. కామెడీ క్యారెక్టర్లు కోవై సరళ కి కొట్టిన పిండి. ఇప్పటి వరకు ఆమె తన 30 ఏళ్ల కెరీర్లో రికార్డు స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె జన్మించింది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో. కోయంబత్తూరు తమిళనాడులో 'కోవై ' అని షార్ట్ గా పిలుస్తుంటారు. అలా ఊరి పేరునే తన ఇంటి పేరుగా ఆమె మార్చుకుంది. తన తండ్రి చెల్లెళ్ళ మద్దతుతో కోవై సరళ సినిమాల్లోకి వచ్చింది.
పదోతరగతి చదువుతున్న సమయంలోనే ఓ గర్భిణి పాత్రలో మెప్పించింది. 18 ఏళ్ల వయసులోనే సీనియర్ హీరో భాగ్యరాజ్ కు తల్లిగా నటించింది. బెస్ట్ కమెడియన్ గా తమిళనాడు ప్రభుత్వం అందించే అవార్డు మూడుసార్లు దక్కించుకుంది. తెలుగులోనూ 'ఓరి నీ ప్రేమ బంగారం కాను' సినిమాకు బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా నంది అవార్డు అందుకుంది. కమెడియన్ గానే కాదు.. తల్లిగా, బామ్మగా, సోదరిగా పలు సపోర్టింగ్ క్యారక్టర్లు చేసింది. ఆమె సినిమాల్లోనూ కాదు తమిళనాడు టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసింది. లెక్కలేనన్ని షోలకు జడ్జిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించింది. రియాల్టీ షోల్లో పాటిస్పేట్ చేయడంతో పాటు.. కామెడీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
కోవై సరళకు పెళ్లి కాలేదు. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఆమెకు ముగ్గురు చెల్లెలు. చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చిన కోవైసరళ.. ముందుగా తన ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేసి తాను చేసుకోవాలను కుంది. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ముగ్గురికి వివాహాలు జరిపించింది. ఇలా చిన్నవయసులోనే బాధ్యతల్లో కూరుకుపోయిన కోవైసరళ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. కానీ తన చెల్లెళ్లకు పుట్టిన పిల్లలను చదివించుకుంటూ..వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటోంది.అంతే కాదు ఎంతో మంది అనాథలను చేరదీసి వాళ్ళ బాగోగులు చూస్తోంది. పదోతరగతి కే కుటుంబ భారాన్ని తలకెత్తుకొని, ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన కోవైసరళ నిజంగా ఎంతో త్యాగమయి.