Begin typing your search above and press return to search.
కేరళ హెల్త్ మినిస్టర్.. కేక పుట్టించిదిగా!
By: Tupaki Desk | 4 Sept 2020 11:40 AM ISTకిలో కూరగాయలను పంచి ఫేస్‌బుక్‌ల్లో ఫోటోలు పెట్టుకొనే నేతలు కొలువుదీరిన ప్రస్తుత రోజుల్లో ఆమె ఓ ఆరుదైన నేత. పబ్లిసిటీ కంటే చేసే పనిమీదే ఆమెకు గురి ఎక్కువ. అందుకే ఏకంగా ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆలోచన పరురాలుగా రికార్డుకెక్కారు. ఆమె మరేవరో కాదు కేరళ వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నదని ముందుగానే గుర్తించారు శైలజ. తన రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతోపాటు పోలీసులను, ఇతర సిబ్బందిని ఆమె ఎంతో చాకచక్యంగా మేనేజ్ చేయగలిగారు.
కేరళ రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా చేయడంలో కీలకపాత్ర పోషించారు. గతంలో శైలజ సేవలను ఐక్యరాజ్యసమితి కూడా కొనియాడింది. పబ్లిక్ సర్వీస్డేను పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్.. ఓ ఆన్లైన్ కార్యక్రమంలో కేరళ వైద్య ఆరోగ్యశాఖను కొనియాడారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ప్రాస్పక్ట్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచంలోనే టాప్50 థింకర్స్‌లో శైలజ నంబర్‌వన్‌గా నిలిచి కేరళకే కాదు.. మొత్తం భారతదేశానికే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అదుపుచేస్తున్నవారిని గుర్తించేందుకు ఈ మ్యాగజైన్ ఓ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది.
శైలజ ఉపాధ్యాయురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం వామపక్ష నేతగా గుర్తింపుపొందారు. కరోనాను కట్టడి చేసేందుకు ఆమె అనవసర అర్బాటాలకు పోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ అనే విధానాన్ని ఆమె తూచ తప్పకుండా పాటించారు.
కేరళ రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చే వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా విపత్తు కంటే ముందు నిఫా వైరస్, 2018-19 సంవత్సరాలలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలోనూ శైలజ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించింది. ఆ అనుభవమే కోవిడ్-19 నియంత్రణ కోసం ఉపయోగపడిందంటారు శైలజ. ఆమె మొత్తం భారతదేశమే గర్వపడేలా ఈ అరుదైన రికార్డును సాధించారు.
కేరళ రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా చేయడంలో కీలకపాత్ర పోషించారు. గతంలో శైలజ సేవలను ఐక్యరాజ్యసమితి కూడా కొనియాడింది. పబ్లిక్ సర్వీస్డేను పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్.. ఓ ఆన్లైన్ కార్యక్రమంలో కేరళ వైద్య ఆరోగ్యశాఖను కొనియాడారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ప్రాస్పక్ట్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచంలోనే టాప్50 థింకర్స్‌లో శైలజ నంబర్‌వన్‌గా నిలిచి కేరళకే కాదు.. మొత్తం భారతదేశానికే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అదుపుచేస్తున్నవారిని గుర్తించేందుకు ఈ మ్యాగజైన్ ఓ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా అనేక దేశాల ప్రజలను సంప్రదించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో నిర్వహించిన ఓ పోల్‌లో శైలజ ప్రథమస్థానం దక్కించుకున్నారు. కరోనా కట్టడిలో ఎంతో కృషి చేసిన న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ రెండవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.