Begin typing your search above and press return to search.

క్రెడిట్ కోసం కిషన్ రెడ్డి తహతహ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   18 Jun 2021 11:26 AM IST
క్రెడిట్ కోసం కిషన్ రెడ్డి తహతహ మామూలుగా లేదుగా?
X
కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్రం ఇటీవల ఓకే చేయటం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక చొరవతోనే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు నిర్ణయం వాస్తవ రూపం దాల్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తాన్ని జస్టిస్ రమణకు దఖలు పర్చాయి మీడియా సంస్థలు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నిర్ణయం వెనుక తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకున్న కిషన్ రెడ్డి మాటలు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల పెంపు నిర్ణయానికి సంబంధించిన ఫైలు మీద కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ముందే సంతకం చేసినట్లుగా ఆయన చెప్పారు. టీహైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచిన ఫైలుపై సంతకం పెట్టటానికి ముందు కేంద్రమంత్రి తనను కలవాలని కబురు చేశారన్నారు.

తాను వెళ్లిన తర్వాత.. తన ఎదుటే ఫైలు మీద సంతకం చేశారని చెప్పారు. ఇంతకీ ఈ బడాయి మాటలు ఎందుకంటే.. హైకోర్టులో న్యాయమూర్తుల పెంపు వ్యవహారంలో క్రెడిట్ తనకు రావాలన్న తపనే కిషన్ రెడ్డి మాటల్లో కనిపిస్తుందని చెప్పాలి. ఒకవేళ.. కిషన్ రెడ్డికి అంత ఇన్ ఫ్లుయెన్స్ ఉండి ఉంటే.. రెండేళ్లుగా ఎందుకు పెండింగ్ లో ఉండి ఉన్నట్లు? వెంటనే ఫైల్ క్లియర్ కావాల్సింది కదా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు.మరీ ప్రశ్నలకు కిషన్ రెడ్డి ఏం చెబుతారో?