Begin typing your search above and press return to search.

సాగు చ‌ట్టాలు మ‌ళ్లీ.. కేంద్ర మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   26 Dec 2021 3:30 AM GMT
సాగు చ‌ట్టాలు మ‌ళ్లీ.. కేంద్ర మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ర‌ద్దు చేసిన‌.. నూత‌న సాగు చ‌ట్టాల విష‌యంలో యూట‌ర్న్ తీసుకుంది. రైతుల ఆందోళ‌న‌లు.. ర‌గ‌డ‌, కోర్టు ఆదేశాలు.. ఇలా.. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన ప‌రిస్థితుల‌కు తోడు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు రైతుల ప‌ట్ల జాలి చూపింది. అయితే.. దీనిపై అప్ప‌ట్లోనే రైతులు సంశ‌యం వ్య‌క్తం చేశారు. ఇత‌ర రూపాల్లో మ‌ళ్లీ ఈ చ‌ట్టాల‌ను తెచ్చే అవ‌కాశం ఉంద‌ని వారు భావించారు. అయితే..పార్ల‌మెంటులో ర‌ద్దు బిల్లులు ఆమోదం పొంది.. త‌ర్వాత‌.. రాష్ట్ర ప‌తి కూడా ప‌చ్చ జెండా ఊప‌డంతో ర‌ద్దు అయిపోయిన‌ట్టు భావించారు.

అయితే.. క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

నాగ్‌పూర్‌(మహారాష్ట్ర)లో అగ్రో విజన్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారు. కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయ‌న్నారు. కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఒక అడుగు ముందుకు వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తామ‌ని రెచ్చ‌గొట్టేలా కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారు. మ‌రి దీనిపై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.