Begin typing your search above and press return to search.

యూట్యూబ్ ద్వారా నెలకి రూ. లక్షలు సంపాదిస్తోన్న ఆ కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   17 Sept 2021 5:00 PM IST
యూట్యూబ్ ద్వారా నెలకి రూ. లక్షలు సంపాదిస్తోన్న ఆ  కేంద్రమంత్రి
X
కంటెంట్ క్రియేటర్లకు మెరుగైన ఆదాయం సమకూర్చే ప్రధాన ఆయుధం యూట్యూబ్. ఎంతోమంది యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ జీవితాన్ని చాలా సాఫీగా సాగిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాను సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తూ.. కొంతమంది అదే సోషల్ మీడియా నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకుని సరికొత్త పంథాను సృష్టించుకుంటారు. ప్రస్తుతం చాలామందికి యూట్యూబ్ ఆదాయం కల్పిస్తుంది. చాలామంది లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే తాజాగా ఓ కేంద్రమంత్రి కూడా తన యూట్యూబ్ ఛానెల్ లో నెలకి రూ. 4 లక్షలు సంపాదిస్తున్నారట.

ఆ కేంద్రమంత్రి ఎవరో కాదు నితిన్‌ గడ్కరీ. ఈయన తన యూట్యూబ్‌ ద్ ఆదాయం నెల అక్షరాల నాలుగు లక్షలకు పైనేనంట. అంతేకాదు తనకు పిల్లనిచ్చిన మామ ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అది ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. హరియాణాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల్ని సమీక్షించడానికి వెళ్లిన గడ్కరీ.. ఓ ఈవెంట్‌కు హాజరై కింది వ్యాఖ్యలు చేశారు.

కరోనా టైంలో ఇంటికే పరిమితమైన నేను రెండే పనులు చేశా. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం. ఆన్‌ లైన్‌ లో చాలా క్లాసులు తీసుకున్నా నేను. అంతేకాదు యూట్యూబ్‌ లోనూ అప్‌ లోడ్‌ చేశా. వాటిని వ్యూస్‌ ఎక్కువ రావడంతో యూట్యూబ్‌ నెలకు నాకు నాలుగు లక్షలు చెల్లిస్తోంది అని చెప్పుకొచ్చారు గడ్కరీ. ఇక పెళ్లైన కొత్తలో తన భార్య కాంచనకు తెలియకుండా.. రోడ్డు మధ్యలో ఉన్న ఆమె తండ్రి ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గుర్తు చేసుకున్నారాయన. ఈ విషయాన్ని తోటి అధికారులు తన దృష్టిని తీసుకొచ్చారని, అయినా కూడా ఆ పని చేయాల్సిందేనని ఆదేశించాలని చెప్పినట్లు నితిన్‌ గడ్కరీ నవ్వుతూ చెప్పారు.