Begin typing your search above and press return to search.

సైరా.. బీజేపీ - టీఆర్ ఎస్ వార్ మొదలైనట్టేనా?

By:  Tupaki Desk   |   27 Sep 2019 7:10 AM GMT
సైరా.. బీజేపీ - టీఆర్ ఎస్ వార్ మొదలైనట్టేనా?
X
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీకి, అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ కు మధ్య వార్ మొదలైనట్టే కనిపిస్తోంది. తెలంగాణకు ఎరువుల సరఫరాలో కోత బీజేపీ కుట్ర అని టీఆర్ఎస్ ఆరోపించడం..కేంద్రం నుంచి వచ్చే నిధులు, కేటాయింపుల్లో బీజేపీ వివక్ష చూపిస్తుండడంపై అసెంబ్లీలో కేసీఆర్ గట్టిగానే మాట్లాడారు.

ఇక తెలంగాణలో అభివృద్ధి విషయంలో ఏకపక్షంగా వెళుతున్న బీజేపీకి అధికార టీఆర్ ఎస్ షాక్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది.

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించడానికి కేంద్రం ఎరువులు - రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ రామగుండానికి వచ్చారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం స్థానిక టీఆర్ ఎస్ ఎంపీ వెంకటేశ్ ను పిలవలేదు. ఈ కర్మాగారం క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసిన బీజేపీకి టీఆర్ ఎస్ గట్టి షాక్ ఇచ్చింది.

స్థానికులకు ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఎంపీ - ఎమ్మెల్యే ఏకంగా కేంద్రమంత్రి సదానంద గౌడనే అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కాన్వాయ్ ముందు ధర్నా చేయడం.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ చొక్కా చింపడం కలకలం రేపింది.

మొత్తంగా రామగుండం ఎరువుల కర్మాగారం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకొని టీఆర్ఎస్ ను డమ్మీ చేయాలని చూసిన బీజేపీ ఎత్తులను టీఆర్ఎస్ చిత్తు చేసింది. కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదనే నిరసనలతో బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. రాబోయే రోజుల్లోనూ తెలంగాణలో ఆదిపత్య పోరు టీఆర్ ఎస్ - బీజేపీల మధ్య సెగలు పుట్టించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.