Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి.. కానీ.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌!!

By:  Tupaki Desk   |   28 Jun 2021 10:31 AM IST
ప‌వ‌న్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి.. కానీ.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌!!
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కేంద్ర మంత్రి కానున్నారా? గ‌తంలో అన్న చిరు మాదిరిగా.. ఆయ‌న కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా చోటు చేసుకోవ‌చ్చు. ఎత్తులు, పైఎత్తుల‌తో సాగే రాజ‌కీయాల్లో.. అనూహ్య ప‌రి ణామాల‌కు కొద‌వే లేదు. పైగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ త‌లుచుకుంటే.. గుర్రాలు ఎగిరిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయ ప‌రిణామ‌మే ఏపీలోనూ చోటు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతోంది. ఏపీలో బ‌ల‌ప‌డాల‌నేది.. బీజేపీ వ్యూహం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌యోగాలు ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రో స‌రికొత్త ప్ర‌యోగంతో క‌మ‌ల నాథులు అడుగులు వేసేందుకురెడీ అయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తున్న స‌మ‌యంలో ఏపీ నుంచి ఒక‌రికి.. అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. ఏపీలో పునాదుల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. బీజేపీకి ఏపీలో గెలిచిన ప్ర‌జాప్ర‌తినిదులు ఎవ‌రూ లేదు. ఈ క్ర‌మంలో ఉన్న రాజ్య స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారా వుకు అవ‌కాశం ఇవ్వాల‌ని.. భావిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదైనా.. రాజ‌కీయంగా చూసుకుంటే.. ఒక ప‌ద‌విని ఇవ్వ‌డం ద్వారా.. మాకేంటి? అని.. పార్టీలు, ప్ర‌భుత్వాలు లెక్క‌లు వేసుకుం టాయి. సో.. ఈ కోణంలో చూసుకుంటే.. జీవీఎల్‌కు ఏపీ నుంచి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. ఆ పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం అనేది పెద్ద‌గా ఉండ‌ద‌నే అంచ‌నాలకు వ‌చ్చిన బీజేపీ పెద్ద‌లు.. ఇప్పుడు వ్యూహం మార్చారు.

ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నిప్ర‌ధాని మోడీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాలు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. ఏపీలో బీజేపీని ప‌రుగులు పెట్టించాల‌నేది వీరి వ్యూహం. అదెలా సాధ్యం అంటే.. జఇక్క‌డే క‌మ‌ల నాథులు వ్యూహాత్మ‌కంగా ఒక విష‌యాన్ని తెర‌మీదికితెచ్చారు. జ‌న‌సేన‌కు నేరుగా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌రు. కానీ, గ‌తంలో చిరంజీవి.. త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్ర మంత్రి ప‌దవి పొందిన‌ట్టే.. ఇప్పుడు.. ప‌వ‌న్ ను కూడా.. త‌మ‌లో విలీనం చేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని టాక్‌.

కేంద్రంలో ప‌వ‌న్‌ను మంత్రిని చేయ‌డం ద్వారా.. ఇటు పార్టీ ప‌రంగా.. త‌మ‌కు ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. జ‌న‌సేన శ్రేణులు ఇక.. కాషాయ కండువా క‌ప్పుకొని.. ఊరూ వాడా ప్ర‌చారం చేస్తార‌ని.. బీజేపీ పెద్ద‌లు స్కెచ్ సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ పార్టీని విలీనం చేసుకుని.. ఆయ‌న‌ను మంత్రి చేయ‌డానికి.. బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగిన‌ట్టు స‌మాచారం. దీనికి.. ఓ కీల‌క కేంద్ర మంత్రి ద్వారా.. ప‌వ‌న్‌ను ముగ్గులోకి లాగే ప్ర‌య‌త్నం సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్‌ను ఏదో ఒక ర‌కంగా ఈ వ్యూహానికి క‌నుక ఒప్పిస్తే.. త‌మ‌కు తిరుగులేద‌ని.. బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.