Begin typing your search above and press return to search.
అసెంబ్లీ ఎక్కడ ఉంటే.. అదే రాజధాని.. తేల్చేసిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 16 Sep 2022 4:59 AM GMTఅమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఓపక్క రాజధాని కోసం భూములు ఇచ్చేసిన రైతులు మహా పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు జగన్ సర్కారు మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు వీలుగా అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. కేంద్ర మంత్రి ఒకరు ఏపీ రాజధాని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వటమే కాదు.. సరికొత్త లాజిక్ ను తెర మీదకు తీసుకురావటం జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
ఏపీ రాజధానిపై సింఫుల్ మాటతో తేల్చేశారే కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి. 'అసెంబ్లీ ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని. రాజధాని ఉన్న అమరావతిని ప్రామాణికంగా తీసుకొని మంగళగిరిలోఎయిమ్స్.. ఇతర సంస్థలు చుట్టుపక్కల వచ్చాయి. డెవలప్ మెంట్ కు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ సమయంలో డెవలప్ మెంట్ పనుల్ని ఎలా నిలిపివేస్తారు?' అంటూ ప్రశ్నించిన ఆయన.. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్లానింగ్ కు బ్రేకులు వేశారని చెప్పాలి.
ఏపీ రాజధానిపై కేంద్రం ఆలోచనలు ఏ రీతిలో ఉన్నాయన్న విషయాన్ని చెప్పేసిన కేంద్రమంత్రి నారాయణ స్వామి.. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు మీద తనకున్న ఫిర్యాదుల్ని చెప్పేందుకు వెనుకాడలేదు. డెవలప్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉందన్న ఆయన.. "రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలవుతున్నాయి. ఈ సమయంలో ఇక్కడ అభివృద్ధి పనులను ఎలా నిలిపివేస్తారు? కేంద్ర పథకాల అమలు.. ఇతర డెవలప్ మెంట్ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉంది" అంటూ తన అసంతృప్తిని బయటపెట్టేశారు.
అమరావతిని రాజధాని కాదని.. విశాఖ పాలనా రాజధానిగా జగన్ సర్కారు చేస్తున్న ఆలోచనల్ని కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ప్రస్తుత ఎన్టీఆర్.. క్రిష్ణా.. గుంటూరు.. పల్నాడు జిల్లాలతో కలిపి ఉన్న అమరావతి అభివృద్ధిని ఎలా విస్మరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానికాదని.. ఒక జిల్లా అని ఎలా చెబుతుంది? అంటూ సూటిగా ప్రశ్నించారు.
తానిప్పుడు రాజధానిగా ఉన్న అమరావతి నుంచే మాట్లాడుతున్నాని.. రాజధాని ఎక్కడన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే అయినా.. అమరావతి అని ముందుగా ప్రకటన చేసి అనంతరం మరో ఆలోచన ఎందుకు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించారు నారాయణ స్వామి.
ఏపీ రాజధాని అమరావతినే అన్న విషయాన్ని స్పష్టంచేసిన కేంద్ర సహాయ మంత్రి.. తన పర్యటనలో జగన్ పాలనలోని లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. తన పర్యటనలో తాను గమనించిన అంశాల్నిఆయన వెల్లడించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడిందని.. జాతీయ స్థాయిలో మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ లో నీటి సమస్యను పరిష్కరించకపోవటం అవమానకరమని.. దీని వల్ల ఇన్ పేషెంట్ రోగులు వైద్య సేవల్ని పొందలేని పరిస్థితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇలా రాజధాని అమరావతిపైనా.. జగన్ సర్కారు పని తీరు పైనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనలంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.