Begin typing your search above and press return to search.

ఎత్తైన వాతావరణ కేంద్రం ప్రారంభించిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   29 Dec 2020 11:59 PM IST
ఎత్తైన వాతావరణ కేంద్రం ప్రారంభించిన కేంద్రమంత్రి
X
దేశంలోనే ఎత్తైన వాతావరణాన్ని కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లఢఖ్ లోని లేహ్ లో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. రహదారులు , వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికలు కోసం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రత్యేక సూచనలను అందించనుంది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. లఢఖ్ లో వాతావరణం తరచూ మారుతూ ఉంటుందని.. ఇది స్థానికులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. అలాగే దేశభద్రత, భౌగౌళిక పరిస్థితుల కారణంగా ఈ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇది హిమాలయాల్లో ఏర్పాటు చేసిన రెండో వాతావరణ కేంద్రం, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోనూ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ిన ఐఎండీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సొరంగ మార్గం సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంది. మలాలి నుంచి లేహ్ వరకు 9.2 కి.మీ మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు.