Begin typing your search above and press return to search.

ఖమ్మం కార్యకర్త కుటుంబానికి కేంద్ర హోం మంత్రి ఫోన్

By:  Tupaki Desk   |   19 April 2022 11:30 AM GMT
ఖమ్మం కార్యకర్త కుటుంబానికి కేంద్ర హోం మంత్రి ఫోన్
X
ఖమ్మం నగరంలో గత వారం బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేశ్ ఉదంతం ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్మ చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. సాయిగణేశ్‌ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిగణేశ్‌ అమ్మమ్మ
సావిత్రి, సోదరితో మాట్లాడి యువకుడి మృతిపై సంతాపం తెలిపారు.

తమకు న్యాయం చేయాలని అమిత్‌షాను కుటుంబీకులు కోరగా.. పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అక్రమ కేసులతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ సాయిగణేశ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం మూడో పట్టణ ఠాణాలో సాయిగణేశ్‌ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. సాయిగణేశ్‌పై 15 కేసులు నమోదు చేసి రౌడీషీట్‌ తెరిచి తెరాస నాయకులు ఒత్తిడి మేరకు పోలీసులు వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సాయిగణేష్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర భాజపా లీగల్‌ సెల్‌ డిమాండ్‌ చేసింది.

సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా బట్లదిన్నె గ్రామశివారులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. సాయిగణేష్‌ ఆత్మహత్య ఘటనలో తెరాస పెద్దలు, పోలీసుల ప్రమేయం ఉన్నందున రాష్ట్ర పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, తెరాస నేతల బెదిరింపులపై రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించారు.సాయిగణేష్‌ ఉదంతం సమయంలోనే మెదక్ జిల్లా రామాయంపేటలో తల్లీకొడుకుల బలవన్మరణం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏకంగా మున్సిపల్ చైర్మన్ నే ఏ-1 గా చేర్చారు.

ఈ రెండు ఘటనలపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈలోగానే సాయిగణేష్ చికిత్స పొందుతూ చనిపోవడం, అతడి అంతిమయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఏకంగా మంత్రి పువ్వాడపైనే బీజేపీ నాయకులు ఆరోపణలకు దిగారు. ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.సాయిగణేశ్‌ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తెరాస నాయకుడు ప్రసన్నకృష్ణ, పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి కోరారు. కమిషనరేట్‌లో భాజపా నాయకులు సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ను కలిశారు. సాయి గణేష్ చురుకైన కార్యకర్త కావడంతో వివాదం చినికిచినికి గాలివానగా మారి.. బీజేపీ జాతీయ స్థాయికి సైతం చేరింది. మరోవైపు టీఆర్ఎస్ నాయకులపై సాయి గణేశ్ అమ్మమ్మ సావిత్రి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణ బలంగా ఉంది.

అమిత్ షా ఫోన్...

ఇవన్నీ ఒకెత్తయితే.. సాయి గణేశ్‌ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. సాయిగణేశ్‌ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిగణేశ్‌ అమ్మమ్మ సావిత్రి, సోదరితో మాట్లాడి సంతాపం తెలిపారు. తమకు న్యాయం చేయాలని అమిత్‌షాను కుటుంబీకులు కోరగా.. పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అక్రమ కేసులతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ సాయిగణేశ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

విషయం పెద్దదవుతోందా?

సాయి గణేశ్ కుటుంబానికి కేంద్ర మంత్రి అది కూడా అమిత్ షా ఫోన్ చేయడం అంటే మామాలు మాటలు కాదు. సాధారణ కార్యకర్త. .అది కూడా ద్వితీయ శ్రేణి నగరానికి చెందిన పార్టీ కార్యకర్త మరణాన్ని కేంద్ర నాయకత్వం ఈ స్థాయిలో స్పందించడం అనూహ్యం. దీన్నిబట్టి సాయిగణేశ్ ఆత్మహత్య ఘటనపై కేంద్రం తీవ్రంగానే పరిశీలిస్తోందని తెలుస్తోంది. అసలే గవర్నర్ కు ప్రొటోకాల్, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధాలు బాగా దెబ్బతిని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం ఘటన మరింత ఆజ్యం పోయనుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.